రాహు : ‘ఏమో.. ఏమో నన్ను తాకే హాయే ప్రేమో..

అభిరామ్ వర్మ, కృతి గర్గ్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ థ్రిల్లర్ ‘రాహు’.. ‘ఏమో ఏమో ఏమో’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు..

  • Published By: sekhar ,Published On : October 31, 2019 / 04:37 AM IST
రాహు : ‘ఏమో.. ఏమో నన్ను తాకే హాయే ప్రేమో..

Updated On : October 31, 2019 / 4:37 AM IST

అభిరామ్ వర్మ, కృతి గర్గ్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ థ్రిల్లర్ ‘రాహు’.. ‘ఏమో ఏమో ఏమో’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు..

అభిరామ్ వర్మ, కృతి గర్గ్, స్వప్నిక, కాలకేయ ప్రభాకర్, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్ అండ్ థ్రిల్లర్ మూవీ.. ‘రాహు’.. సుబ్బు వేదుల దర్శకత్వంలో.. శ్రీ శక్తి స్వరూప్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై.. ఏవీఆర్ స్వామి, రాజా దేవరకొండ, శ్రీ శక్తి బాబ్జీ, సుబ్బు వేదుల కలిసి నిర్మిస్తున్నారు.

‘రాంగ్ టైమ్, రాంగ్ ప్లేస్, రాంగ్ గర్ల్’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్, ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘ఏమో ఏమో ఏమో’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. యంగ్ సింగింగ్ సెన్సేషన్ సిడ్ శ్రీరామ్ ఈ పాట పాడాడు..

ప్రవీణ్ లక్కరాజు ట్యూన్, శ్రీనివాస మౌళి లిరిక్స్‌కు సిడ్ వాయిస్ తోడవడంతో పాటకు కొత్త అందం వచ్చింది.. ఈ బ్యూటిఫుల్ మెలోడి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది.
త్వరలో ‘రాహు’ రిలీజ్ కానుంది. మ్యూజిక్ : ప్రవీణ్ లక్కరాజు, కెమెరా : సురేష్ రగుతు, ఈశ్వర్, ఎడిటింగ్ : అమర్ రెడ్డి.