రామ్ 18 ఫిక్స్ : కిషోర్‌తో ముచ్చటగా మూడోసారి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమలతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నాడు.. అక్టోబర్ 28 సాయంత్రం ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు..

  • Publish Date - October 28, 2019 / 06:34 AM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమలతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నాడు.. అక్టోబర్ 28 సాయంత్రం ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. దీపావళినాడు తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఫ్లాప్స్‌లో ఉండగా తనకు ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నాడు. తర్వాత రామ్, కిషోర్ కలిసి చేసిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనుకున్నంతగా ఆకట్టుకోలేదు.

ఈ సినిమా వచ్చిన రెండేళ్లకు వీళ్ళ కాంబోలో సినిమా అనౌన్స్ చేశారు. కిషోర్ ఇటీవల సాయి ధరమ్ తేజ్‌ హీరోగా ‘చిత్రలహరి’ చేసి మంచి హిట్ అందుకున్నాడు. రామ్ హీరోగా నటిస్తున్న 18వ సినిమా ఇది..

Read Also : ‘ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్’ అంటున్న విశాల్

రామ్ హోమ్ బ్యానర్ ‘స్రవంతి మూవీస్’లో అన్నయ్య చైతన్యకృష్ణ సమర్పణలో, స్రవంతి రవికిషోర్ నిర్మించనున్నారు. అక్టోబర్ 28 సాయంత్రం ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. సంగీతం : ‘స్వరబ్రహ్మ’ మణిశర్మ, కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : జునైద్, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్.