రామ్ ‘రెడ్’ – రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కలయికలో రూపొందనున్న ‘రెడ్’ వేసవి కానుకగా 2020 ఏప్రిల్ 9న విడుదల కానుంది..

  • Publish Date - October 30, 2019 / 11:24 AM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కలయికలో రూపొందనున్న ‘రెడ్’ వేసవి కానుకగా 2020 ఏప్రిల్ 9న విడుదల కానుంది..

‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల తర్వాత, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కలిసి చేస్తున్న సినిమా.. ‘రెడ్’.. తమిళ్ బ్లాక్ బస్టర్ ‘తడమ్’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ చేయనున్నాడు. రామ్ 18వ సినిమా ఇది.. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్స్..

అక్టోబర్ 30 ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం.. సాయంత్రానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వేసవి కానుకగా 2020 ఏప్రిల్ 9న ‘రెడ్’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

బ్యానర్ : స్రవంతి మూవీస్, సమర్పణ : కృష్ణ పోతినేని, సంగీతం : ’మెలోడిబ్రహ్మ’ మణిశర్మ, కెమెరా : సమీర్ రెడ్డి, యాక్షన్ : పీటర్ హెయిన్, ఎడిటింగ్ : జునైద్, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్, నిర్మాత : స్రవంతి రవికిషోర్, రచన-దర్శకత్వం : కిషోర్ తిరుమల.