even Rajinikanth asks a character in ponniyin selvan but manirathnam said no
Rajinikanth : మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష, జయరామ్.. లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చెన్నైలో భారీగా నిర్వహించగా దీనికి రజినీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిధులుగా వచ్చారు. ఇద్దరు స్టార్ హీరోలు రజిని, కమల్ ఒకే స్టేజిమీద చాలా రోజుల తర్వాత కనపడేసరికి సినీ ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పొన్నియిన్ సెల్వన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రజినీకాంత్ మాట్లాడుతూ.. ”ఈ కథలో వంతియాతివన్ పాత్రకు నేను సరిపోతానని అప్పట్లో జయలలిత చెప్పారు. జయలలిత చెప్పారని నేను పొన్నియన్ సెల్వన్ పుస్తకం చదివాను. ఇందులోని నందిని పాత్ర నా నరసింహా సినిమాలోని నీలాంబరి పాత్రకు స్ఫూర్తి. గతంలోనే నేను, కమల్ హాసన్, శ్రీదేవి, విజయ్ కాంత్‌లు కలిసి ఈ సినిమా తీయాలని అనుకున్నాం. కానీ కుదర్లేదు. ఇప్పుడు మణిరత్నం తీస్తున్నాడని తెలిసి ఈ సినిమాలో నటించాలి అనుకోని చిన్న పాత్రైనా సరే ఇవ్వమని మణిరత్నంను అడిగాను. కానీ మణిరత్నం ఇవ్వలేదు, ఈ సినిమాలో చిన్న పాత్ర అడిగితే నీ అభిమానులతో నన్ను తిట్టించాలని అనుకుంటున్నావా అని ఆయన అన్నారు. మిగతా వేరే ఎవరైనా నేను నటిస్తానంటే సినిమా కమర్షియల్ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఒప్పుకునేవారు. మణిరత్నం ఒక్కరే కాదన్నారు” అని తెలిపారు.