EX Minister Roja Interesting Comments on Ram Charan
Ram Charan – Roja : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం RC16 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా నటి, మాజీ మంత్రి రోజా రామ్ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రోజా ముందునుంచి చిరంజీవి అభిమాని అని తెలిసిందే. పాలిటిక్స్ లో అభిప్రాయం బేధాలు ఉన్నా నటనలో మాత్రం రోజాకు చిరంజీవి అంటే అభిమానం.
తాజాగా రోజా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ప్రస్తావన వచ్చింది. రామ్ చరణ్ గురించి రోజా మాట్లాడుతూ.. చిన్నప్పుడు రామ్ చరణ్ ని ఎత్తుకొని పెంచాను. ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటీకి వచ్చాడు. అప్పుడు చాలా అల్లరి. అప్పుడు చాలా చిన్నప్పుడు. స్కూల్ లో జాయిన్ అయ్యాక అల్లరి తగ్గింది. RRR చూశాక చాలా గర్వంగా అనిపించింది. ఓపెనింగ్ షాట్ లో చరణ్ దూకి అందర్నీ కొట్టి వస్తాడు అది అయితే భలే అనిపించింది. అతని డ్యాన్స్ లో వాళ్ళ నాన్న కనిపిస్తాడు. చిన్నప్పటి నుంచి చరణ్ వాళ్ళ నాన్న పాటలకు డ్యాన్స్ వేసేవాడు అంటూ పొగుడుతూ కామెంట్స్ చేయడంతో రోజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.