ప్రియాంక చోప్రా అల్లరిని వీడియోను షేర్ చేసిన భర్త నిక్ జోనాస్..
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకుని ఫారెన్‌లోనే సెటిలై పోయింది. ప్రస్తుతానికి ప్రియాంక హాలీవుడ్, బాలీవుడ్ ఎక్కడా సినిమాలు చేయట్లేదు.
నిక్ మాత్రం తన జోనాస్ బ్రదర్స్ ట్రూప్ తరపున మ్యూజికల్ టూర్స్‌తో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘ది వాయిస్ సీజన్ 18’ లోకి ఎంటరవుతున్నాడు. ఈ సింగింగ్ రియాలిటీ షోలో జాన్ లెజెండ్, కెల్లీ క్లార్క్ సన్, బ్లేక్ షెల్టన్ తదితరులు నిక్ తో కనిపించనున్నారు.
See Also>>మెట్రోలో జర్నీచేస్తూ సినిమాలు చూడొచ్చు…డౌన్ లోడ్ కూడా!
తాజగా విడుదల చేసిన వీడయో ఆకట్టుకుంటోంది. నిక్, ప్రియాంకకు ఈ వీడియో చూపించగా ప్రియాంక ఎగిరిగంతేసినంత పని చేసింది. నిక్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.