F2-హనీ ఈజ్ ది బెస్ట్ వీడియో సాంగ్

ఎఫ్2 లోని హనీ ఈజ్ ది బెస్ట్ వీడియో సాంగ్ రిలీజ్..

  • Publish Date - February 11, 2019 / 06:03 AM IST

ఎఫ్2 లోని హనీ ఈజ్ ది బెస్ట్ వీడియో సాంగ్ రిలీజ్..

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్2.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, సంక్రాంతి విన్నర్‌గా నిలవడమే కాకుండా, టాలీవుడ్‌కి 2019 వ సంవత్సరానికి చక్కని శుభారంభాన్నిచ్చింది. ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యింది కూడా. రీసెంట్‌గా ఎఫ్2 లోని హనీ ఈజ్ ది బెస్ట్ వీడియో సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ ఇవ్వగా, శ్రీమణి లిరిక్స్ రాసాడు. సింపుల్ స్టెప్స్, బ్యూటిఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంటుందీ పాట..

హనీ చేసే పనులకి కోపం వస్తున్నా, ప్రేమించిన పాపానికి వరుణ్ తిప్పలు పడడం, ప్రియదర్శి, హనీ ఫ్రెండ్ లవర్ కావడంతో ఏమీ అనలేక పోవడం, హనీ చేసే విధ్వంసానికి చమ్మక్ చంద్ర తనని తానే బెల్ట్‌తో కొట్టుకోవడం చాలా ఫన్నీగా ఉంటాయి.

వాచ్ వీడియో సాంగ్…