సంక్రాంతి అల్లుళ్ళు : బుల్లితెరపైనా సత్తాచాటారు

బుల్లితెరపై సత్తాచాటిన ఎఫ్2..

  • Publish Date - April 18, 2019 / 12:09 PM IST

బుల్లితెరపై సత్తాచాటిన ఎఫ్2..

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తోడల్లుళ్ళుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్ళుగా నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ఎఫ్2.. ఫన్ అండ్ ఫస్ట్రేషన్.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలవడమేకాక వెంకీ, వరుణ్‌లకు కెరీర్ బెస్ట్ ఫిలింగా మిగిలింది. రిలీజ్ అయిన నెలరోజులకే అమోజాన్‌లో స్ట్రీమింగ్ అయినా థియేట్రికల్ రన్ ఏమాత్రం తగ్గలేదు.

ఇప్పుడు బుల్లితెరపైన కూడా సత్తాచాటారు సంక్రాంతి అల్లుళ్ళు.. ఉగాది సందర్భంగా ఎఫ్2 మూవీని స్టార్ మా ఛానెల్ టెలికాస్ట్ చెయ్యగా, టీఆర్పీ పరంగానూ రికార్డు క్రియేట్ చేసింది. పండగ కావడం, ఫ్యామిలీ అంతా కలిసి చూడడంతో ఈ సినిమాకి 17.2 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

వాచ్ గిర్రా గిర్రా వీడియో సాంగ్..