Fake Flashback Movies in Tollywood and Kollywood
Fake Flashback Movies : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘లియో’. విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో.. పార్తీబన్, లియో రెండు పాత్రలతో ఆడియన్స్ కి కనిపిస్తాడు. కాగా సినిమాలో లియో పాత్రకి సంబంధించిన కథ ఫ్లాష్‌బ్యాక్ లో వస్తుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ని జైలులో ఉండే ఓ ఖైదీ చెప్తాడు. అయితే ఆ ఖైదీ చెప్పిన కథ అబద్దం అని, లియోకి సంబంధించిన కథ వేరే అని, లియో సెకండ్ హాఫ్ అంతా ఫేక్ అని, ఆడియన్స్ ని ఫూల్ చేశారని తెలిసింది.
అయితే ఒక ఫేక్ స్టోరీతో ఆడియన్స్ ని ఫూల్ చేయడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. ఇంతకుముందు కూడా పలు సినిమాలు ఫేక్ ఫ్లాష్‌బ్యాక్ ఆడియన్స్ ని ఒక ఎమోషన్ లోకి తీసుకు వెళ్లి, ఆ తరువాత అది అబద్దపు కథ అని చెప్పి ఫూల్ చేశారు. అలా ఫేక్ ఫ్లాష్‌బ్యాక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు వైపు ఒక లుక్ వేసేయండి.
Also read : VarunLav : వరుణ్, లావణ్య హల్దీ వేడుక పిక్స్ వైరల్.. పవన్ కళ్యాణ్ అభిమానుల బాధ..
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘డార్లింగ్’ సినిమాలో.. విలన్‌కి హీరో ఒక అందమైన ఫేక్ ఫ్లాష్‌బ్యాక్ చెప్పి విలన్‌తో పాటు ఆడియన్స్ ని కూడా ఫూల్ చేశాడు. అలాగే తమిళంలో రజినీకాంత్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘పేట’ సినిమాలో.. రజిని, సేతుపతికి ఫేక్ ఫ్లాష్‌బ్యాక్ చెబుతాడు. అలాగే విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘పిజ్జా’లో కూడా ఇలానే ఫేక్ ఫ్లాష్‌బ్యాక్ తో మోసం చేశారు.
‘1 – నేనొక్కడినే’లో మహేష్ బాబుకి నాజర్, ‘సారొచ్చారు’ సినిమాలో కాజల్ అగర్వాల్‌కి, ‘ఖిలాడీ’ సినిమాలో మీనాక్షి చౌదరికి రవితేజ ఫేక్ ఫ్లాష్‌బ్యాక్ లు చెబుతారు. ‘మస్కా’ సినిమాలో రామ్ కూడా ఫేక్ ఫ్లాష్‌బ్యాక్ నే చెబుతాడు. ఇంకా వెతుకుతూ వెళ్తుంటే చాలా సినిమాలే ఫేక్ ఫ్లాష్‌బ్యాక్ తో కనిపిస్తున్నాయి.