Samantha: అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంతకి అతడి మాటలు ధైర్యాన్ని ఇచ్చాయంట.. ఎవరా వ్యక్తి?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా 'మయోసిటిస్' అనే అరుదైన వ్యాధితో పడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సంఘీభావం తెలియజేసారు. కాగా కష్ట సమయంలో అతడి మాటలు సమంతకి ధైర్యాన్ని ఇచ్చాయంట..

Family man director Raj words gave courage to Samantha in her bad times

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా ‘మయోసిటిస్’ అనే అరుదైన వ్యాధితో పడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సంఘీభావం తెలియజేసారు. అనారోగ్య కారణాలు వల్ల కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన సమంత ఎట్టకేలకు నేడు మీడియా ముందుకు వచ్చింది. సామ్ నటించిన పాన్ ఇండియా మూవీ “యశోద” రిలీజ్ దగ్గర పడడంతో అనారోగ్యం సమయంలో కూడా సినిమా ప్రమోషన్ కోసం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పట్ల ఆమె డెడికేషన్ చూసి అభిమానులు శభాష్ అంటున్నారు.

Samantha : సమంత వ్యాధిపై నాగబాబు రియాక్షన్.. ఈ జనరేషన్‌లో గ్రేటెస్ట్ యాక్టర్ సమంత..

ఎన్నో రోజుల నుంచి సమంత తన మొఖాన్ని దాచుకుంటూ వస్తుండడంతో, అసలు ఆమె ఫేస్ కి ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫొటోస్ చూసిన అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ ఫొటోస్ ని ట్యాగ్ చేస్తూ చేసిన కామెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. “నా ఫ్రెండ్ రాజ్ చెప్పాడు.. రోజులు మంచివా, చెడ్డవా అనేది ముఖ్యం కాదు, వాటిని ఎలా ఎదురుకొని మనం ముందుకు వెళ్ళాం అనేదే ముఖ్యం. ఈ మాటలే నన్ను ఈరోజు మీ ముందు ఇలా ఆరోగ్యంగా నిలబెట్టాయి” అంటూ వ్యాఖ్యానించింది.

ఇక తమ అభిమాన నటికి ఇంతటి ధైర్యాన్ని ఇచ్చిన ఆ ‘రాజ్’ ఎవరని గూగుల్ మొత్తం సెర్చ్ చేస్తున్నారు అభిమానులు. సమంత నటించిన హిందీ వెబ్ సిరీస్ “ఫామిలీ మ్యాన్” దర్శకుడే ఈ రాజ్. త్వరలోనే సామ్ మళ్ళీ ఈ దర్శకుడితో మరో వెబ్ సిరీస్ చేబోతున్నట్లు సమాచారం. కాగా నవంబర్ 11న విడుదలవుతున్న ‘యశోద’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.