Family week in Bigg Boss house Housemates emotional after seeing their parents
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 నుండి ఈ వారం గంగవ్వ, హరితేజ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. వీరి ఎలిమినేషన్ తర్వాత నామినేషన్ ప్రక్రియ సైతం రసవత్తరంగా ఉంది. నామినేషన్స్ తర్వాత అందరూ ఊహించినట్టుగానే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యింది. తాజాగా దీనికి సంబందించిన ప్రోమో రిలీజ్ చేసారు. ఇక ప్రోమో చూసుకుంటే.. లగ్జరీ బడ్జెట్ కోసం నబీల్ తన స్వీట్స్ ను త్యాగం చేస్తాడు. అలానే హౌస్ లో ఉన్నన్ని రోజులు స్వీట్స్ తినకూడదని బిగ్ బాస్ చెప్పాడు. ఆ టాస్క్ ను ముగిస్తూ ఈ రోజు ప్రోమోలో నబీల్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి బిగ్ బాస్ స్వీట్స్ ఇస్తాడు.
Also Read : Mukesh Khanna : శక్తిమాన్ మళ్ళీ తిరిగొస్తున్నాడు.. లీకైన ముఖేష్ ఖన్నా వీడియో..
ఇక అదే సమయంలో నబీల్ తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. సడన్ గా తన తల్లిని హౌస్ లో చూసి షాక్ అవుతాడు నబీల్. ఇన్ని రోజుల తర్వాత అమ్మని చూసి ఎమోషనల్ అయ్యారు. ప్రతీ రోజు మీరు అందరూ గుర్తొస్తారు అని తన తల్లికి చెప్తూ ఏడుస్తాడు నబీల్. ఎలాగైనా నువ్వు కప్పు కొట్టుకొనే రావాలని నబీల్ తల్లి అంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత నబీల్ తల్లి వెళ్ళిపోతుంది. తర్వాత రోహిణి తల్లి వస్తుంది. తన తల్లితో పాటు ఓ చిన్న బాబు కూడా వస్తాడు. తన తల్లిని చూసిన వెంటనే గట్టిగా పట్టుకొని రోహిణి ఏడుస్తుంది.
అప్పుడు తేజ.. అందరి పేరెంట్స్ వస్తున్నారు బిగ్ బాస్.. మా అమ్మని పంపండి.. నేను ఏడిస్తే మా అమ్మకి అస్సలు నచ్చదు అని ఏడుస్తాడు. తర్వాత రోహిణి తల్లి.. విష్ణు దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని నీకు అమ్మ లేదని బాధపడకు నేనే నీకు అమ్మని అనుకో అంటుంది. అలా ప్రోమో ఎండ్ అవుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఇద్దరి పేరెంట్స్ వచ్చారు. ముందు ముందు ఎవరెవరు వస్తారో చూడాలి.