తెలుగు సినిమా తెరపై తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకుని చనిపోయిన హాస్య నటుడు వేణు మాధవ్ మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన మృతదేహం చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనను చూడడానికి వచ్చిన సినీ నటి, తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న యాంకర్ ఉదయభాను ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. వన్స్ మోర్ ప్లీజ్ అనే టీవీ కార్యక్రమంలో ఉదయభాను వేణు మాధవ్ తో కలిసి చేయగా అప్పట్లో ఆ షో కు విపరీతమైన క్రేజ్ ఉండేది.
ఈ సమయంలో ఆనాటి గుర్తులను గుర్తు చేసుకున్న ఉదయభాను కన్నీటి పర్యంతం అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. వేణు మాధవ్, ఉదయభాను కాంబినేషన్ కు అప్పుడు మంచి క్రేజ్ వచ్చిందని, ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ.. నవ్వుతూనే ఉండే వ్యక్తి వేణు మాధవ్ అని ఆమె అన్నారు.
వేణు మాధవ్ మరణవార్త విని షాక్ కు గురైనట్లు చెప్పిన ఉదయభాను.. వేణు మాధవ్ చాలా అల్లరి చేసేవాడని, అందరితో డిఫరెంట్ గా ఉన్నా కూడా.. తనను మాత్రం సొంత చెల్లెలుగా చూసుకునేవాడు అని చెప్పుకొచ్చారు.