Cool Jayanth : గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమలో విషాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే కన్నడ పరిశ్రమలో పునీత్ మరణం అందర్నీ కలవర పెట్టింది. అది మరవక ముందే రెండు రోజుల క్రితం మలయాళ పరిశ్రమలో సీనియర్ నటి కోజికోడ్ శారద మరణించారు. తాజాగా తమిళ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ, మలయాళ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కూల్ జయంత్ నిన్న మరణించారు.
Anasuya : దానికోసం గుండు కొట్టించుకోడానికి కూడా రెడీ : అనసూయ
సినీ రంగంలో డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించి ప్రభుదేవా, రాజు సుందరం లాంటి మాస్టర్స్ వద్ద కొన్ని చిత్రాలకు డాన్సర్‌గా పని చేశారు జయంత్. కూల్ జయంత్ దాదాపు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు. అనంతరం ప్రేమ దేశం (కాదల్ దేశం) సినిమాతో పూర్తి స్థాయి నృత్య దర్శకుడిగా పరిచయమయ్యారు. అబ్బాస్, వినీత్, టబు నటించిన ‘ప్రేమదేశం’ అప్పట్లో భారీ విజయం సాధించింది. ప్రేమ చిత్రాల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో కూల్ జయంత్ కి కూడా అవకాశాలు వచ్చాయి.
Khiladi : ఫిబ్రవరిలో ‘ఖిలాడీ’ ఆట షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళం, మలయాళ భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు జయంత్. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కూల్ జయంత్ నృత్య దర్శకత్వం వహించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన నిన్న ఉదయం చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. అయితే ఆయనకు కేవలం 44 సంవత్సరాలే కావడంతో తొందరగా మరణించారు అంటూ ఈయన మృతిపై పలువురు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు, నృత్య దర్శకులు, డ్యాన్సర్లు సంతాపం తెలిపారు. నిన్న సాయంత్రం చెన్నైలోనే అంత్యక్రియలు జరిపారు.