Famous Gujarathi Singer Vaishali Balsara suspicious death
Vaishali Balsara : ప్రముఖ గుజరాతీ సింగర్ వైశాలి బల్సారా ప్రైవేట్ ఆల్బమ్స్, స్టేజి షోలతో పాటు కొన్ని సినిమాల్లో కూడా పాడి పాపులారిటీ తెచ్చుకుంది. వైశాలి భర్త హితేష్ కూడా గాయకుడే. గత శనివారం హితేష్ తన భార్య కనిపించట్లేదంటూ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. అయితే గుజరాత్ వల్సాద్ జిల్లాలో పార్ నది ఒడ్డున ఓ కారు చాలా సేపు ఆగి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు ఓపెన్ చేసి చూడగా బ్యాక్ సీట్లో ఓ మృతదేహం కనిపించింది. ఆ మృతుదేహాన్ని సింగర్ వైశాలి బల్సారాగా పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇలా కారులో అనుమానాస్పద రీతిలో సింగర్ వైశాలి మృతుదేహం ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.
Nandamuri Balakrishna : హీరో బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఆ సినిమా విషయంలో వివాదం
గుజరాతీ ప్రముఖ గాయని వైశాలి ఇలా అనుమానాస్పదరీతిలో మరణించడంతో ఈ వార్త సంచలనంగా మారింది. వైశాలి అభిమానులు, నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేస్తున్నారు.