Nandamuri Balakrishna : హీరో బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఆ సినిమా విషయంలో వివాదం

హీరో నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ పై జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది.

Nandamuri Balakrishna : హీరో బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఆ సినిమా విషయంలో వివాదం

Nandamuri Balakrishna : హీరో నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ పై జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది. గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేటు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ వేసింది.

పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని పిటిషన్ లో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆ పన్ను రాయితీ సొమ్ముని సినిమా యూనిట్ నుంచి రికవరీ చేయాల్సిందిగా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం హీరో బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసుల సంగతి తమకు తెలియదని గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్ర నిర్మాణ సంస్థలు. ప్రస్తుతం బాలకృష్ణ టర్కీలో ఉన్నారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీ బాలకృష్ణ కెరీర్‌లో వందో సినిమాగా తెరకెక్కింది. దీనికి క్రిష్ డైరెక్షన్ చేశారు. 2017లో ఈ సినిమా విడుదల చేశారు. రెండవ శతాబ్దానికి సంబంధించిన శాతవాహన సామ్రాజ్యాధినేత గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రియ హీరోయిన్ పాత్రలో, హేమమాలిని బాలకృష్ణ తల్లి పాత్రలో నటించారు.

అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాకు వినోద పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సినిమా యూనిట్ కోరింది. దీంతో అప్పట్లో ఈ సినిమాకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపు ఇచాయి. అయితే పన్ను మినహాయింపు ఇచ్చినా సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని చెబుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.