Trisha : విజయ్‌ని అడిగానని చెప్పండి అన్న అభిమాని.. త్రిష రియాక్షన్ వైరల్..

సూర్య, త్రిష ముఖ్య పాత్రల్లో నటించిన కరుప్పు సినిమా నేడు రిలీజ్ అయింది. (Trisha)

  • Published on- May 15, 2026 / 06:58 PM IST

Trisha

Trisha : విజయ్ – త్రిష రిలేషన్ గత కొన్నాళ్లుగా తమిళనాట వైరల్ అవుతూనే ఉంది. త్రిష విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. విజయ్ ఫ్యాన్స్ త్రిషని వదిన అని కూడా సంబోధిస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ త్రిషని పలకరించిన వీడియో వైరల్ గా మారింది.

సూర్య, త్రిష ముఖ్య పాత్రల్లో నటించిన కరుప్పు సినిమా నేడు రిలీజ్ అయింది. త్రిష ఈ సినిమాని చెన్నైలోని ఓ థియేటర్లో చూడటానికి వెళ్ళింది. త్రిష సినిమా చూసి బయటకు వస్తుంటే అభిమానులు ఆమె కారు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఓ విజయ్ అభిమాని ఆమె కార్ వద్దకు వచ్చి తలపతి విజయ్ ని అడిగానని చెప్పండి అని అన్నాడు. ఆ మాటలకు త్రిష ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

Also Read : Mr. Work From Home : ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ మూవీ రివ్యూ.. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటో తెలుసా..?

దీంతో విజయ్ పేరు ప్రస్తావన తీసుకురాగానే త్రిష సిగ్గుపడి నవ్వుకుంటూ వెళ్లిపోవడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.