ఫ్యాన్స్‌ వార్‌.. నిర్మాతలకు ప్రాణసంకటంగా మారుతోందా?

టాలీవుడ్‌లో ఫ్యాన్స్‌ వార్‌ నిర్మాతలకు ప్రాణసంకటంగా మారుతోందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది.

Fan War Is it becoming a life threatening situation for producers

టాలీవుడ్‌లో ఫ్యాన్స్‌ వార్‌ నిర్మాతలకు ప్రాణసంకటంగా మారుతోందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్‌.. మిగిలిన హీరోలపై విషం చిమ్ముతూ చేస్తున్న ప్రచారం వల్ల కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతున్నాయట. ఈ విషప్రచారం బడా హీరోలకు తలనొప్పిగా మారడంతో ఏకంగా నిర్మాతలే రంగంలోకి దిగాల్సివస్తోంది. దేవర నిర్మాత నాగవంశీ ఈ పని స్టార్ట్‌ చేయడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

సోషల్‌ మీడియా వేదికగా టాలీవుడ్‌ సినిమాలపై అభిమానులు సృష్టిస్తున్న రచ్చ శృతి మించిపోతోంది. తాజాగా దేవర సినిమాపై సోషల్‌మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుండటంతో ఆ చిత్ర నిర్మాత కలవరపాటుకు గురవుతున్నట్లు చెబుతున్నారు. తమకు ఇష్టమైన హీరోను అమితంగా ప్రేమించే అభిమానులు… మిగిలిన హీరోలపై అసహ్యం కలిగించే కామెంట్స్‌ చేస్తున్నారు. దీనివల్ల జనరల్‌ ఆడియన్స్‌ ఇన్‌ ఫ్లూయొన్స్‌ అవ్వడమే కాకుండా ఆయా సినిమాలు చూసేందుకు కూడా ఇష్టపడటం లేదంటున్నారు. ఇది ఓవరాల్‌గా సినిమా కలెక్షన్లు, రిజల్ట్‌పై ప్రభావం చూపుతోందని అంటున్నారు.

Jayam Ravi : హీరోతో ఎఫైర్ వార్త‌లు.. ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన సింగ‌ర్‌..

ఒక సారి ఒక హీరో సినిమాపై మరో హీరో అభిమానులు నెగెటివిటీ ప్రచారం చేస్తే.. ఆ హీరో వంతు వచ్చినప్పుడు మేమూ అదేచేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల టాలీవుడ్‌లో నాన్సెన్స్‌ ఎక్కువైపోయింది. తాజాగా దేవర విషయంలో ఇలాంటి నూసెన్స్‌ ఎక్కువగా జరుగుతుండటంతో అభిమానులు సోషల్‌ మీడియా యుద్ధాన్ని ఆపేయాలని రిక్వెస్ట్‌ చేశారు దేవర నిర్మాత నాగవంశీ. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన నాగవంశీ… దేవర సినిమాపై ఇతర హీరోల అభిమానులు నెగిటివ్‌ ప్రచారం ఆపేయాలని కోరడం టాలీవుడ్‌లో చర్చకు దారితీసింది. ఇంతవరకు ఏ నిర్మాత కూడా ఇలాంటి రిక్వెస్ట్ చేయకపోవడంతో నిర్మాత నాగవంశీ చక్కని సంప్రదాయానికి తెరతీశారని ప్రశంసలు అందుకుంటున్నారు.

నాగవంశీ రిక్వెస్ట్‌తో ఫ్యాన్స్‌ వార్‌ ఆపేయాలనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని, అంతమాత్రానికి ఇలాంటి రచ్చ చేయడం అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి విష సంస్కృతి ఒక్క సినిమాతో ఆగిపోదని.. త్వరలో రిలీజ్ అవ్వబోయే మిగతా పెద్ద హీరోల సినిమాలను కూడా వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు టాలీవుడ్‌ పెద్దలు. దీంతో దేవరపై విష ప్రచారం చేస్తున్న కోస్టార్స్‌ అభిమానులు టాలీవుడ్‌ డిమాండ్‌ను వింటారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Kali Trailer : ‘కలి’ ట్రైలర్.. ఇంట్రెస్టింగ్‌గా ఉందిగా..