Jayam Ravi : హీరోతో ఎఫైర్ వార్తలు.. ఎట్టకేలకు మౌనం వీడిన సింగర్..
సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో జయం రవి డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది.

Kenishaa Francis Breaks Silence On Being Accused Of Breaking Jayam Ravis Marriage
తమిళ హీరో జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే.. ఈ విషయం తనకు తెలియని ఆర్తి ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. వీరిద్దరు విడిపోవడానికి ఓ గాయని కారణం అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో జయం రవి డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది.
దీనిపై ఇప్పటికే జయం రవి స్పందించాడు. అవన్నీపుకార్లు మాత్రమేనని, గాయనిని ఇందులోకి లాగొద్దని కోరాడు. తాను అన్ని ఆధారాలతో కోర్టులో పరిష్కారం కోరుతున్నానని అన్నారు. ఇక తాజాగా దీనిపై సదరు గాయని కెనిషా ఫ్రాన్సిస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది.
Kali Trailer : ‘కలి’ ట్రైలర్.. ఇంట్రెస్టింగ్‌గా ఉందిగా..
ఇలాంటి పుకార్లను నమ్మొద్దని కెనీషా కోరింది. తాను ఈ విషయం పై ఏ మీడియాతోనూ మాట్లాడనని చెప్పింది. ఇతరుల సమస్యలను మీవిగా చేసుకోవడానికి స్వేచ్ఛను తీసుకున్న అందరికీ తాను ఒక వినయపూర్వకమైన అభ్యర్థనను చేస్తున్నట్లు తెలిపింది.
‘ముందుగా వినయపూర్వకంగా మీకు చెబుతున్నాను. దీనికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ ఇంటి సమస్య కాదు.. మరొకరిది. మీరు ఈ విషయంలో ఒక అభిప్రాయానికి అర్హులు కాదు.. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దయగా ఉండాల్సిన అవసరం ఉందని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయంపై నేను ఏ ఇతర మీడియాతో మాట్లాడను.’ అని ఆర్తి అన్నారు.
Game Changer : రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. రెండో సాంగ్ పోస్టర్ చూశారా?
View this post on Instagram