Fans making shocking comments on Prabhas movie producers
Rajasaab: పాన్ ఇండియా స్టార్ అనే పదానికి పర్ఫెక్ట్ కటౌట్ అంటే ప్రభాస్ అనే చెప్పాలి. ఇది కాస్త ఎక్కువయ్యింది అనిపించవచ్చు కానీ, ఆయన సినిమాల లైనప్ చూస్తూనే ఆ రేంజ్ లో ఉంది మరి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు ప్రభాస్. (Rajasaab)ఆ లిస్టులో రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 లాంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా రిలీజ్ కానున్న సినిమా రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇంతకాలం అంటే రిలీజ్ డేట్ తెలియదు కాబట్టి, ఆగాల్సి వచ్చింది. కానీ, రేలసే దగ్గర పడుతున్నా కూడా ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం లేదు ఏంటి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓపక్క మర్చిలో రావాల్సిన పెద్ది మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ కూడా విడుదల చేశారు. కానీ, రాజాసాబ్ మూవీ టీం మాత్రం ఇంకా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. ఇప్పటికే, ట్రైలర్ విడుదల చేశారు కానీ, సాంగ్ విడుదల ఉంటుంది అని చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు.
కానీ, ఆ సాంగ్ మాత్రం రిలీజ్ కావడం లేదు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. మా ప్రభాస్ సినిమాలకే ఎందుకు ఇలా అవుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాడు. బాహుబలి నుంచి మొన్నవచ్చిన కల్కి వరకు ఇదే కంటిన్యూ అవుతూ వస్తోంది. ఇక ఈ మేకర్స్ మారరా. మేము అడిగితేనే అప్డేట్స్ ఇస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజాసాబ్ నుంచి ఆ ఫస్ట్ సాంగ్ దించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ పై రాజాసాబ్ మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.