Samyuktha Shan: వెనుకబడిన వారిపై సినిమాలు.. అవకాశాలు మాత్రం పెద్దోళ్ళకి.. వాళ్ళని గొప్పవాళ్ళని చేయండి చూద్దాం..
మారి సెల్వరాజ్.. ఈ తమిళ దర్శకుడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన శైలీలో(Samyuktha Shan) సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.
Actress Samyuktha Shan shocking comments on director Mari Selvaraj
Samyuktha Shan: మారి సెల్వరాజ్.. ఈ తమిళ దర్శకుడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన శైలీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు ఎక్కువగా అణగారిన, అణచివేయబడిన వర్గాల మీదనే ఉంటాయి. రీసెంట్ గా ఆయన చేసిన సినిమా(Samyuktha Shan) బైసన్.చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిజల్ట్ అంత గొప్పగా రాలేదు.
అయితే, ఈ సినిమా విడుదల సమయంలో దర్శకుడు మారి సెల్వరాజ్ పై కొన్ని కామెంట్స్ వినిపించాయి. ఎప్పుడు ఒకేరకమైన కాన్సెప్ట్ సినిమాలు చేస్తారు అని. ఓపెన్ గానే చాలా మంది ఈ కామెంట్స్ చేశారు. దానికి ఆయన తన ఫిలిం మేకింగ్ అలాగే ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. అయితే, ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈయన తమిళ దర్శకుడు అయినప్పటికి తన సినిమాల్లో హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా వేరే భాష వాళ్ళు ఉంటారు. ఇదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించగా చాలా వింత సమాధానం ఇచ్చాడు.
“సినిమాలో ఒక వికలాంగుడి పాత్ర ఉందంటే అది వికలాంగుడితోనే చేయించాల్సిన అవసరం లేదు” అని చెప్పుకొచ్చాడు. మారి సెల్వరాజ్ చేసిన ఈ కామెంట్స్ పై నటి సంయుక్తా షాన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ..”ఆయన అలా రెస్పాండ్ అవుతాడని అనుకోలేదు. నేను షాక్ అయ్యాను. ఆయన ఎప్పుడూ తన జాతి, కులం గురించి మాట్లాడుతూ, సినిమాలు చేస్తారు కదా. కానీ, తన జాతి లేదా కులానికి సంబంధించిన వాళ్లకు మాత్రం అవకాశాలు ఇవ్వడు. వారిలో మంచి నటీనటులు లేరా? వాళ్ళని ఎందుకు లైమ్ లైట్లోకి తీసుకురావడంలేదు” అంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా ఆమె చెప్పింది కరక్టే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై దర్శకుడు మారి సెల్వరాజ్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
