Paruchuri Gopalakrishna: “ఓజీ” నాకే అర్థం కాలేదు.. కేవలం అదొక్కటే.. పవన్ కళ్యాణ్ కాకుండా వేరే హీరో అయితే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాను మరోసారి బాక్సాఫీస్ కి రుచి చూపించిన సినిమా ఓజీ. (Paruchuri Gopalakrishna)దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Paruchuri Gopalakrishna: “ఓజీ” నాకే అర్థం కాలేదు.. కేవలం అదొక్కటే.. పవన్ కళ్యాణ్ కాకుండా వేరే హీరో అయితే..

Writer Paruchuri Gopalakrishna shocking comments on OG movie

Updated On : November 10, 2025 / 3:40 PM IST

Paruchuri Gopalakrishna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాను మరోసారి బాక్సాఫీస్ కి రుచి చూపించిన సినిమా ఓజీ. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన దర్శకుడు సుజీత్ ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారా చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు.విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత అదే రేంజ్ లో (Paruchuri Gopalakrishna)ఆడియన్స్ ను మెప్పించి సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Yellamma: మళ్ళీ హీరో మారిపోయాడు.. దేవి కూడా అవుట్.. ఇంకా ఎంతమంది వేణు భయ్యా..

ఇటీవలే ఓటీటీకి వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సాధించింది. ఇదిలా ఉంటే, టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ పేరుతో సినిమాల విశ్లేషణ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా గురించి విశ్లేషణ చేశారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ..”ఓజీ సినిమాను స్ట్రెయిట్ నరేషన్ లో చెప్పుంటే ఫలితం మరోలా ఉండేది. దర్శకుడు ఈ సినిమాను నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ప్లేతో కథను నడిపించాడు. చూపితిప్పనీయకుండా కథను నడిపించాడు. ఆ విషయంలో ఆయనకు అభినందనలు.

నాకు తెలిసి ఫ్యాన్ కి తప్పా సాధారణ మహిళా ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. దర్శకుడు ఈ సినిమాను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా సెట్ చేశాడు. కొన్ని సందర్భాలలో కథ, కథనాలే కాదు చిన్నా పాత్రైనా సినిమా విజయానికి చాలా వరకు సహాయపడుతుంది. ఫ్లాష్‌బ్యాక్స్‌, ప్రెజెంట్‌ స్టోరీలను చూపిస్తూ స్క్రీన్‌ప్లేతో ఆడుకున్నాడు దర్శకుడు సుజీత్‌. అందుకేనేమో, దాదాపు 400 చిత్రాలకు వర్క్‌ చేసిన నాకే పూర్తిగా అర్థం కాలేదు. రెండోసారి చూడాల్సి వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్థానంలో మరో హీరో అయితే ఎలా ఉండేది? అని ఆలోచన వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాల కృష్ణ. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.