Yellamma: మళ్ళీ హీరో మారిపోయాడు.. దేవి కూడా అవుట్.. ఇంకా ఎంతమంది వేణు భయ్యా..

బలగం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కి గురి చేశాడు వేణు ఎల్దండి. అప్పటివరకు ఒక (Yellamma)కమెడియన్ గానే అందరికి తెలిసిన వేణు తనలోని రచయితను, దర్శకుడిని బలగం సినిమాతో పరిచయం చేశాడు.

Yellamma: మళ్ళీ హీరో మారిపోయాడు.. దేవి కూడా అవుట్.. ఇంకా ఎంతమంది వేణు భయ్యా..

Devi Sri Prasad also dropped from Yellamma movie

Updated On : November 10, 2025 / 2:45 PM IST

Yellamma: బలగం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కి గురి చేశాడు వేణు ఎల్దండి. అప్పటివరకు ఒక కమెడియన్ గానే అందరికి తెలిసిన వేణు తనలోని రచయితను, దర్శకుడిని బలగం సినిమాతో పరిచయం చేశాడు. కేవలం పరిచేయడం చేయడమే కాదు.. (Yellamma)బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది. చాలా కాలం తారువాత ఒక సినిమా చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకోవడం అంటే అది ఈ సినిమాకే జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు వేణు ఎల్లమ్మ అనే సినిమాను స్టార్ట్ చేశాడు.

Deepshikha: లాంగ్ స్కర్ట్ లో దీప్షిక క్రేజీ లుక్స్.. ఫోటోలు

ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దిల్ రాజు ఈ సినిమాను నేచురల్ స్టార్ నానితో చేయాలనీ అనుకున్నాడు. కానీ, అనూహ్యంగా ఈ సినిమా నుంచి నాని తప్పుకున్నాడు. ఆ తరువాత అదే కథ యంగ్ హీరో శర్వానంద్ వద్దకు వెళ్ళింది. ఆయన కూడా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత నితిన్ కి అదే కథను చెప్పి ఒప్పించారు. ఇక అన్నీ సెట్ అయ్యాయి త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుంది అనుకున్నారు. హీరో నితిన్ కూడా ఈ ప్రాజెక్టుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ, నితిన్ చేస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతుండటంతో ఆ ఇంపాక్ట్ ఎల్లమ్మ సినిమాపై పడకూడదు అని నితిన్ ను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారు మేకర్స్.

రీసెంట్ కథనాల ప్రకారం ఎల్లమ్మ సినిమాలో నటించేందుకు మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ ను ఒప్పించాడట దిల్ రాజు. గతంలో కూడా దేవి శ్రీ ప్రసాద్ ను తానే హీరోగా చేస్తానని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఇప్పుడు ఆ మాటను నిజం చేసుకోబోతున్నాడు అని అంటారు ఫిక్స్ అయ్యాడు.ఏదైతేనేం ఎల్లమ్మ సినిమాకు హీరో దొరికేశాడు అని అంతా అనుక్కున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఇక ఫైనల్ గా ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తో ఈసినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారట మేకర్స్. మ్యాడ్. మ్యాడ్ 2 సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచుకున్నాడు. ఆయన హీరోగా వచ్చిన ఆయ్ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ హీరో అయితే ఎల్లమ్మ సినిమాలో పర్ఫెక్ట్ గా ఉంటాడని అనుకుంటున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది అని టాక్. మరి ఈ హీరోతో అయినా సినిమా మొదలుపెడతారా.. మళ్ళీ మారతాడా అనేది చూడాలి.