Allu Arjun: కవర్ పేజీపై బన్నీ ఫోటో.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ చిత్రంతో ఎక్కడికో వెళ్లిపోయాడు. అంతకుముందు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే క్రేజ్ ఉన్న హీరోగా తెలిసిన బన్నీ.....

Fans Of Allu Arjun Prabhas Troll Each Other For India Today Cover Page

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ చిత్రంతో ఎక్కడికో వెళ్లిపోయాడు. అంతకుముందు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే క్రేజ్ ఉన్న హీరోగా తెలిసిన బన్నీ, పుష్ప సినిమాతో యావత్ ప్రపంచానికి తన సత్తా చాటాడు. కేవలం రీజినల్ మూవీగా మాత్రమే రిలీజ్ అయిన పుష్ప ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. ఈ సినిమాలో బన్నీ మేనరిజం, ఆయన యాక్టింగ్, డ్యాన్స్ స్టెప్పులకు యావత్ ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

Allu Arjun : పుష్ప 2లో ఏం చూపించబోతున్నారు?

అయితే తాజాగా ప్రముఖ మ్యాగెజిన్ ఇండియా టుడే కవర్ పేజీపై సౌత్ స్వాగ్ అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోను ప్రింట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సౌత్ ఇండియా సినిమా స్థాయితో పాటు తన స్టామినాను నేషన్ వైడ్‌గా చాటుతున్న తమ హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బన్నీ ఫ్యాన్స్‌తో వార్ డిక్లేర్ చేశారు. తమ హీరో 2017లోనే ఇండియా టుడే కవర్ పేజీపై కనిపించాడని, అప్పుడే దక్షిణాది సినిమా గురించి యావత్ దేశం చర్చించుకునేలా చేశాడని వారు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా బన్నీ ఫ్యాన్స్ కూడా పలు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Allu Arjun: పుష్ప 2 కోసం బన్నీ డేరింగ్ స్టెప్.. ఏమిటంటే..?

కేవలం బాహుబలి సినిమా గురించే ప్రభాస్ ఫోటో వేశారని, కానీ తమ హీరో ఫోటోను ఆయన తన స్టైల్‌ను యావత్ ప్రపంచానికి రుచిచూపించడంతో ఇప్పుడు అది ట్రెండ్‌గా మారడంతో ఆయనకు ఇండియా టుడే ఈ విధంగా సత్కారం చేసిందంటూ బన్నీ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా ఇండియా టుడే కవర్ పేజీపై బన్నీ స్టైలిష్ ఫోటో కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. అటు పలు మీడియా ఛానల్స్‌లోనూ ఈ ఫ్యాన్ వార్ గురించి చర్చ సాగుతుండటం గమనార్హం. ఏదేమైనా ఒక్క పాన్ ఇండియా సినిమా రిలీజ్ లేకుండా అల్లు అర్జున్ తన క్రేజ్, స్టైల్ కారణంగా ఇండియా టుడే కవర్ పేజీపై తన స్వాగ్‌ను చూపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.