Darling Re-Release: ఇది పిచ్చికి పీక్స్ భయ్యా.. డార్లింగ్ రీ రిలీజ్.. ‘ఇంకా ఎదో’ సాంగ్ రీ క్రియేషన్ వీడియో వైరల్

ప్రభాస్ 'డార్లింగ్' రీ-రిలీజ్(Darling Re-Release) థియేటర్‌లో అభిమానులు 'ఇంకా ఏదో' పాటను రీక్రియేట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Fans recreate Inka edho song in prabhas darling re-release theater video viral

  • ప్రభాస్ డార్లింగ్ మూవీ రీ రిలీజ్
  • థియేటర్స్ లో సందడి చేసిన ఫ్యాన్స్
  • ‘ఇంకా ఎదో’ సాంగ్ రీ క్రియేషన్ వీడియో వైరల్

Darling Re-Release: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ ఒక ఊపు ఊపేస్తోంది. అగ్ర హీరోల పాత సూపర్ హిట్ చిత్రాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తుండటంతో, అభిమానుల హంగామా మామూలుగా ఉండటం లేదు. కొత్త సినిమాల విడుదల కంటే ఎక్కువగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. కేవలం సినిమా చూడటమే కాకుండా, అందులోని ఐకానిక్ సీన్స్, సాంగ్స్‌ను అదే స్థాయిలో రీ-క్రియేట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘డార్లింగ్’ సినిమా తాజాగా రీ-రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

Michael: ఇండియాలో ‘మైఖేల్ జాక్సన్’ బయోపిక్ క్రేజ్.. లక్షల్లో టికెట్ల అమ్మకాలు.. బాక్సాఫీస్ షేక్

ప్రభాస్, కాజల్, కరుణాకరన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ క్యూట్ లవ్ స్టోరీ రీ-రిలీజ్(Darling Re-Release) సందర్భంగా థియేటర్లు ప్రభాస్ నామస్మరణతో దద్దరిల్లుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్ ఇప్పటికీ ఎంతో ఫ్రెష్‌గా ఉండటంతో నేటి తరం ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని మెలోడీ సాంగ్స్ అభిమానులకు ఎంతో ఇష్టం.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు ‘డార్లింగ్’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ “ఇంకా ఏదో.. ఇంకా ఏదో..” పాటను రీ-క్రియేట్ చేశారు. ప్రభాస్, కాజల్ లాగే డ్రెస్ వేసుకొని, వాళ్ళ లాగే స్టెప్పులను, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ను ఇమిటేట్ చేస్తూ తీసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “వీళ్ల పిచ్చి పీక్స్‌కు చేరింది” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, ప్రభాస్ మీద ఉన్న అభిమానాన్ని చూసి మరికొందరు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతమైన వ్యూస్ సంపాదిస్తూ ప్రభాస్ క్రేజ్‌ను మరోసారి నిరూపిస్తోంది.