Bandla Ganesh : రాజకీయాల నుండి తప్పుకున్న బండ్ల గణేష్

సినీ నిర్మాత బండ్ల గణేష్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తనకున్న కుటుంబ బాధ్యతల వల్ల తప్పుకుంటున్నట్లు తెలిపారు.

Bandla Ganesh

Bandla Ganesh : సినీ నిర్మాత బండ్ల గణేష్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తనకున్న కుటుంబ బాధ్యతల వల్ల తప్పుకుంటున్నట్లు తెలిపారు. తన ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో వారి కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

తన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ తనకున్న పనులు, వ్యాపారాల వల్ల తాను పాలిటిక్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదన్నారు.

Bandla Ganesh : కార్లు గాలిలోకి ఎగిరి.. హీరో వందమందిని కొడితే జనాలు థియేటర్లకు రారు.. టాలీవుడ్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..

తనకు అందరూ ఆత్మీయలు, సమానులేనని చెప్పారు. ఇంతకుముందు తన వల్ల ఎవరైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బాధపడి ఉంటే పెద్ద మనసుతో తనను క్షమిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.