Swetaa Varma : బిగ్‌బాస్ శ్వేతావర్మ ఇంట్లో అగ్నిప్రమాదం.. మేం క్షేమంగా ఉన్నాం కానీ..

తాజాగా శ్వేతావర్మ తన ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపింది. దానికి సంబంధించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Fire Accident in Bigg Boss fame Swetaa Varma House

Swetaa Varma : బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న శ్వేతావర్మ అంతకుముందు ద రోజ్ విల్లా, ముగ్గురు మొన‌గాళ్లు, ప‌చ్చీస్‌, సైకిల్, మ్యాడ్ .. లాంటి పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఇటీవల కొన్ని వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది శ్వేతా. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది శ్వేతావర్మ.

తాజాగా శ్వేతావర్మ తన ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపింది. దానికి సంబంధించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Also Read : Varun Lavanya : వరుణ్ – లావణ్య పెళ్లి వేడుక ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందా?

ఓ భయంకరంగా అగ్ని ప్రమాదాన్ని నేను మా ఇంట్లో చూశాను. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. ఒక రూమ్ మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీ, నా పెట్స్ సేఫ్ గానే ఉన్నారు. కానీ ఈ భయంకరమైన ఘటన నుండి తేరుకోవడానికి మాకు చాలా టైం పట్టేలా ఉంది. నా కోసం మీరు ప్రేయర్ చేయండి. మేము అయితే ఇప్పుడు క్షేమంగానే ఉన్నాము. నేను సోషల్ మీడియాకు రావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది అని తన పోస్ట్ ద్వారా తెలిపింది శ్వేతావర్మ. దీంతో ఆమె ఫాలోవర్లు జాగ్రత్త అని చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.