రాజావారు రాణిగారు-ఫస్ట్ లుక్

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్స్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్న'రాజావారు రాణిగారు' ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : May 3, 2019 / 01:57 PM IST
రాజావారు రాణిగారు-ఫస్ట్ లుక్

Updated On : May 3, 2019 / 1:57 PM IST

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్స్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్న’రాజావారు రాణిగారు’ ఫస్ట్ లుక్ రిలీజ్..

కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా చూడకుండా, చిన్న సినిమాలను కూడా విజయవంతం చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు.. వైవిధ్యంతో కూడిన సినిమాలు వచ్చిన ప్రతిసారీ ఈ విషయం ప్రూవ్ అయ్యింది. అదే కోవలో ‘రాజావారు రాణిగారు’ అనే సినిమా రాబోతుంది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా, మనోవికాస్ నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. హీరో, హీరోయిన్ పెయిర్, పోస్టర్ డిజైనింగ్ బాగుంది.

ఈ సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్స్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న’రాజావారు రాణిగారు’ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీకి కెమెరా : విద్యా సాగర్, అమర్ దీప్, ఎడిటింగ్ : విప్లవ్, మ్యూజిక్ : జై క్రిష్, లిరిక్స్ : భరద్వాజ్, రాకేందు మౌళి.