FNCC all India Open bridge tournament winners prize distribution
FNCC : సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ టోర్నమెంట్ అయిన ఎఫ్‌ఎన్‌సిసి ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్.. గత వారం గ్రాండ్ గా మొదలయింది. ఎఫ్‌ఎన్‌సిసి (FNCC) నిర్వహించే ఈ టోర్నమెంట్ ఈ ఏడాది 12వ పురస్కారం జరుపుకుంది. ఇక ఈ టోర్నమెంట్ ఓపెనింగ్ లో హీరో నిఖిల్, ఫార్మర్ క్రికెటర్ మరియు ముంబై మాస్టర్స్, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ఫ్రాంచెస్ కో ఓనర్ శ్రీ చాముండేశ్వరనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Also read : Ram Charan : అరేయ్ చిట్టిబాబు అంటూ.. రామ్‌చరణ్‌కి రంగమ్మ అత్త విషెస్.. వీడియో వైరల్
మార్చి 9న మొదలైన ఈ టోర్నమెంట్ మార్చి 11తో పూర్తి అయ్యింది. ఇక టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన నెస్ట్ ఇన్ టీం చెన్నై గ్రూప్ కి ఎఫ్‌ఎన్‌సిసి ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎల్ నారాయణ మరియు డైరెక్టర్ బి గోపాల్ చేతుల మీదగా నవయుగ ట్రోఫీని, అలాగే క్యాష్ ప్రైజ్ ని అందజేశారు. నవయుగ ఇంజనీరింగ్ స్పాన్సర్‌షిప్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాల నుంచి అనేకమంది పాల్గొన్నారు.