Cinema Folk Songs: వెండితెరపై మోత మోగిస్తున్న జానపదం!

జానపదం అంటే జనం పాట. జనాల నాలుక మీద నుండి పుట్టి అదే జనాల మధ్య ప్రాచుర్యం పొంది కొత్త కొత్త వాసనలు తనలో నింపుకొని విరాజిల్లే పాట. ఒకప్పుడు ఈ జానపద పాటలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు

Cinema Folk Songs: జానపదం అంటే జనం పాట. జనాల నాలుక మీద నుండి పుట్టి అదే జనాల మధ్య ప్రాచుర్యం పొంది కొత్త కొత్త వాసనలు తనలో నింపుకొని విరాజిల్లే పాట. ఒకప్పుడు ఈ జానపద పాటలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ కాలక్రమేణా జానపదాలు పల్లెలకు పరిమితం కాగా.. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా పుట్టుకొచ్చిన రికార్డింగ్ పాటలు ప్రజల మనసులకి ఎక్కేశాయి. కానీ, ఇప్పుడు మళ్ళీ పాత మట్టి వాసనే మన ప్రేక్షకులకు బంగారంలా కనిపించింది. అందుకే ఇప్పుడు జానపద పాటలకు మన వెండితెర మీద మంచి డిమాండ్ ఏర్పడుతుంది.

Rajinikanth: మళ్ళీ మాస్ యాంగిల్ మీదే ఫోకస్ చేసిన రజనీ

జానపదానికి మళ్ళీ మన ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుంటే సినిమా మేకర్స్.. కిన్నెర కళాకారుడు మొగిలయ్య వంటి వారిని వెతికి మరీ పట్టుకొస్తున్నారు. జాపడానికి మన సినిమాకి సాన్నిహిత్యం ఈనాటిదేం కాదు. జానపదం అనగానే ఇప్పటి శ్రోతలకు, ప్రేక్షకులకు గున్నా గున్నా మామిడి.. రాములో రాములా పాటలే గుర్తుకు వస్తాయి. కానీ అంతకి మించిన భక్తి పాటలు, ఉద్యమ గీతాలు కూడా మన వెండితెరని దున్నేశాయి.

Telugu Young Heros: యాక్షన్ మీద మోజు పడుతున్న రొమాంటిక్ హీరోలు

‘మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో’ (అదృష్టవంతులు).. ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే’ (అమ్మమాట), ‘మాయ చేసి పోతివిరో నాగులు’ (జీవితం) పాటలు అప్పటి మన సినిమా జనాలకు ఎంత హుషారెత్తించాయో.. ‘నందామయా గురుడ నందామయా’ (పెద్దమనుషులు), ‘శివశివమూర్తివి గణనాథ’ (పెద్దమనుషులు), ‘రామన్న రాముడు కోదండ రాముడు’ (లవకుశ) వంటి జానపద పాటలు కూడా మన భక్తి ప్రేమికులకు ఇంకా గుర్తులుగానే మిగిలి ఉన్నాయి. నిజానికి ఈ జానపద సరుకు మన సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు ఓ ఊపు ఊపేసి వెళ్తుంది.

Drugs Case: ఈడీ విచారణకు నవదీప్.. ఎఫ్‌ క్లబ్‌ పార్టీలపై అధికారుల ఫోకస్!

కొన్నేళ్ల కిందట ‘లాలూ దర్వాజ లస్కర్‌ బోనాల్‌ పండగ’ (మొండి మొగుడు పెంకిపెళ్లాం), ‘తాటిచెట్టు ఎక్కలేవు.. తాటికల్లు తెంపలేవు (తమ్ముడు)’, ‘బైబైయ్యే బంగారు రమణమ్మ’ ‘(ఖుషి) వంటి జానపదాలు మెరుపులా వస్తే ‘మాయదారి మైసమ్మో’ (కాలేజ్‌), ‘నాంపల్లి టేషను కాడ రాజలింగో’, ‘హే లిగజిగిడి లంబాణి’, ‘ఎర్రజెండెర్రజెండెన్నీయలో’, ‘బండెనక బండి కట్టి’, ‘జంజంబల్‌ మర్రి వేయికాళ్ల జెర్రి’, ‘గాజులోళ్లమే పిల్లా మేము’ అంటూ మరోసారి సినిమాకు తామెంత అవసరమో గుర్తుచేశాయి.

Big Boss 5: బయటపడిన కాజల్‌ బండారం.. సరయు బూతులకు గ్రీన్ సిగ్నల్

ఈ ఆ మధ్య మళ్ళీ కాస్త అవసరం లేదని మన సినిమా వదిలేసిన జానపదం ఈ మధ్య మళ్ళీ ఓ పూనకంలా వచ్చి చేరింది. ‘పలాస’ సినిమాతో నాది నక్కిలీసు గొలుసు అంటూ అసిరయ్య మొదలు పెట్టిన పాటతో మళ్ళీ
జానపదాలు ఊపు మీదున్నాయి. ‘కాటమరాయుడా కదిరి నర్సింహుడా’ (అత్తారింటికి దారేది), పెంచలదాసు రాసి పాడిన ‘దారి చూడు దమ్ము చూడు’ (కృష్ణార్జున యుద్ధం) మల్టీఫ్లెక్స్ ప్రేక్షకుల నోళ్ళలో కూడా అవలీలగా దొర్లుతుంటే మిగతా సినీ మేకర్స్ కూడా వీటిపై దృష్టి పెట్టారు.

Weather Update: అలెర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు!

అలానే ‘ఆగట్టునుంటావా’ (రంగస్థలం), ‘గున్నా గున్నా మామిడి’ (రాజా ది గ్రేట్‌), ‘బావొచ్చాడోలమ్మ’ (పలాసా), ‘వస్తానంటివో పోతానంటివో’ (శ్రీకారం) నుండి ‘సారంగ దరియా’ శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’, ‘దిగు దిగు దిగు నాగ’ వరుడు కావలెను వంటి రాబోయే సినిమాల వరకు కూడా జానపదం కొత్త ఒరవడిగా దూసుకొస్తోంది. మరోసారి ‘భీమ్లా నాయక్‌’లో పవన్, త్రివిక్రమ్ తమకి కలిసొచ్చిన జానపదంతోనే బోణీ కొట్టడంతో నో డౌట్ ట్రెండు మారినా.. జానపదానికున్న ఒరిజినాలిటీ ఝల్లుమంటూనే ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు