2019 ఏడాదికిగాను టాప్ 100 భారతీయ సెలబ్రిటీల లిస్ట్ ను ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ గురువారం(డిసెంబర్-19,2019) విడుదల చేసింది. అక్టోబర్-1,2018 నుంచి సెప్టెంబర్-30,2019మధ్యకాలంలో భారతీయ సెలబ్రిటీల వార్షిక సంపాదన,వారి స్టార్ స్టేటస్ ఆధారంగా ఈ లిస్ట్ ను విడుదల చేశారు.
ఇప్పటి వరకూ బ్యాట్‌తో చెలరేగిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీరూ. 252.72 కోట్ల ఆదాయంతో ..2016నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజ నటుడిని కూడా వెనక్కి నెట్టి ఈ ఏడాది తొలిసారిగా ఫోర్బ్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన విరాట్ ఈసారి మొదటి పొజిషన్‌కు ఎగబాకారు. బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక 2016 నుంచి మొదటిస్థానంలో నిలిచిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సారి మూడో స్థానానికి పడిపోయాడు. బాలీవుడ్ కా బాద్షా అమితాబ్ బచ్చన్ నాలుగో స్థానంలో నిలవగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఐదో స్థానంలో నిలిచాడు. క్రికెట్ ప్రేమికుల ఆరాధ్య దైవం సచిన్ టెండుల్కర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొణే 10వ స్థానంలో నలిచింది.
అయితే ఈ ఏడాది ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సారి మరింత వేగంగా దూసుకెళ్లి ఈ జాబితాలో 13వ స్థానం దక్కించుకున్నాడు. ఇక ఈ జాబితాలో బాహుబలి ప్రభాస్ 44వ స్థానంలో నిలిచారు. 2017లో ప్రభాస్ కు ఫోర్బ్స్ జాబితాలో 22వ స్థానం దక్కగా..గత ఏడాది ఫోర్బ్స్ జాబితాలో మాత్రం ప్రభాస్‌కు చోటు దక్కకపోగా ఈ సారి దక్కడం విశేషంగా చెప్పుకుంటున్నారు. గత ఏడాది ప్రకటించిన లిస్ట్‌లో 33వ స్థానంలో నిలిచిన మహేష్ (35 కోట్లు) ఈ దఫా 54వ స్థానానికి పడిపోయారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ (21.5 కోట్లు) తొలిసారి 77వ స్థాన్ని దక్కించుకున్నారు.