ఫోర్భ్స్ టాప్ 10 సెలబ్రిటీలు వీరే.. అక్షయ్ కుమార్ సంపాదన ఎంతంటే?   

  • Publish Date - June 5, 2020 / 07:06 AM IST

ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ప్రపంచంలోనే అత్యంత సంపాదన కలిగిన టాప్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదిలో 100 సెలబ్రిటీల జాబితాలో ఒక భారతీయ సెలబ్రిటీకి మాత్రమే చోటు దక్కింది. ఇప్పుడు టాప్ 10 లిస్టు జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ టాప్ లిస్టులో నిలిచాడు. కిలాడీ కుమార్ మూవీతో అక్షయ్.. జూన్ 2019 నుంచి మే 2020 వరకు 52వ స్థానంలోనే కొనసాగుతూ 48.5 మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నాడు. 

2. Kylie Jenner :


22ఏళ్ల మహిళా పారిశ్రామిక వేత్త Kylie Jenner టాప్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఈమె సంపాదన 590 మిలియన్లు. ఇటీవలే ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో Kylie చోటు కోల్పోయారు. 

3. Kanye West : 

అమెరికన్ రాపర్ Kanye West కూడా టాప్ సెలిబ్రిటీ జాబితాలో చేరిపోయాడు. కానీ, Kylie తర్వాతి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. గత జూన్ 2019 నుంచి మే 2020 వరకు Kanye West రాపర్ ఆదాయం 170 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. 

4. Roger Federer : 

టెన్నీస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ కూడా టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకున్నాడు. ఫెదరర్ సంపాదన 106.3 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచాడు. 

5. Cristiano Ronaldo :

ఫుట్ బాల్ ప్లేయర్ Cristiano Ronaldo 105 మిలియన్ల డాలర్లతో నాల్గో స్థానంలో నిలిచాడు. 

6. Lionel Messi  :

ఫుట్ బాల్ ప్లేయర్  Lionel Messi కూడా టాప్ సెలబ్రిటీలో జాబితాలో చోటు దక్కించుకున్నాడు. జూన్ 2019 నుంచి మే 2020 వరకు మెస్సి సంపాదన 104 మిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. 

7. Tyler Perry: 

హాలీవుడ్ నటుడు కమెడియన్ Tyler Perry కూడా 97 మిలియన్ డాలర్ల సంపాదనతో ఆరో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. 

8. Neymar

ఫుట్ బాల్ ప్లేయర్ Neymar కూడా టాప్ సెలబ్రిటీల జాబితాలో ఉన్నాడు. ఇతడి సంపాదన 95.5 మిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో నిలిచాడు. 

9. Howard Stern : 

టెలివిజన్ హోస్ట్ Howard Stern కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. జూన్ 2019 నుంచి మే 2020 మధ్య కాలంలో 90 మిలియన్ డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో నిలిచాడు. 

10. LeBron James :

అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ LeBron James కూడా 88.2 మిలియన్ డాలర్ల సంపాదనతో 9వ ర్యాంకులో నిలిచాడు. 

11. Dwayne Johnson :

హాలీవుడ్ నటుడు Dwayne Johnson కూడా టాప్ సెలబ్రిటీ జాబితాలో నిలిచాడు. జూన్ 2019 నుంచి మే 2020 మధ్యకాలంలో 87.5 మిలియన్ డాలర్లతో పదో స్థానంలో నిలిచాడు. 

Read: కష్టం ఎక్కడుంటే అక్కడుంటా:‘నిసర్గ’బాధితులకు సోనూసూద్ అండ..

ట్రెండింగ్ వార్తలు