Pari Paswan : నాకు మత్తు ఇచ్చి పోర్న్ ఫిల్మ్ తీశారు.. మాజీ మిస్‌ యూనివర్స్‌ షాకింగ్ కామెంట్స్!

పోర్న్ రాకెట్ కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో బాలీవుడ్ షాక్ అయింది. రాజ్‌కుంద్ర పోర్నోగ్రఫీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Former Miss India Universe Pari Paswan Accuses Production

Former Miss India Universe Pari Paswan : పోర్న్ రాకెట్ కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో బాలీవుడ్ షాక్ అయింది. రాజ్‌కుంద్ర పోర్నోగ్రఫీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్టుగా ప్రొడక్షన్ హౌస్‌పై జార్ఖండ్ మోడల్, మాజీ మిస్ యూనివర్స్ షాకింగ్ కామెంట్స్ చేసింది. మాజీ VVN మిస్ ఇండియా యూనివర్స్ 2019 విజేత పారి పాశ్వాన్ ముంబైకి చెందిన ప్రొడక్షన్ హౌస్ తనకు మత్తు ఇచ్చి పోర్న్ ఫిల్మ్ తీశారని ఆరోపించింది. ముంబైకి చెందిన ప్రొడక్షన్ హౌస్ ఆమెకు కూల్ డ్రింక్ తాగించి మత్తులో ఉన్న సమయంలో ఆమెతో పోర్న్ వీడియో తీసినట్టు ఆరోపిస్తోంది. ఆ ప్రొడక్షన్ హౌస్ పేరును మాత్రం బయటపెట్టలేదు. అయితే, ఆమెకు మత్తు కలిపిన డ్రింక్ ఇచ్చారని, ఆ తర్వాత ఈ సంఘటన జరిగిందని వెల్లడించింది. తాను మత్తులో నుంచి తెరుకున్న తర్వాత అసలు విషయం తెలిసి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పారి పాశ్వాన్ తెలిపింది.
Mukku Avinash : ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాష్

వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తమతో బలవంతంగా అశ్లీల చిత్రాలను చిత్రీకరంచి యాప్‌లో అప్‌లోడ్‌ చేశాడంటూ పలువురు అమ్మాయిలు ఇప్పటికే అతడిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కుంద్రాపై ఆరోపణలు రుజువు కావడంతో జైలుకు వెళ్లాడు. ఈ కేసు విచారణలో ఉండగానే మరో పోర్నోగ్రఫీ వ్యవహరం వెలుగు చూసింది. మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ పారీ పాసవాన్‌ బాధితురాలు కావడంతో బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. ఒక ప్రొడక్షన్‌ హౌజ్‌ తనకు మత్తు కలిపిన కూల్‌ డ్రింగ్‌ ఇచ్చి తనపై పోర్న్‌ వీడియో షూట్‌ చేశారంటూ ఆమె ఆరోపించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తాను ముంబై వచ్చిన కొత్తలో ఓ ప్రొడక్షన్‌ హౌజ్‌కు వెళ్లినట్టు తెలిపింది. అక్కడ వాళ్లు తనకు కూల్‌డ్రింగ్‌ ఇచ్చారని, అందులో మత్తు కలపడంతో తాను స్పృహా కొల్పోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తనపై అడల్ట్‌ కంటెంట్‌ వీడియో తీశారంటూ ఆరోపించింది. తాను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. ఆ ప్రొడక్షన్‌ హౌజ్‌ పేరు ఏంటో వెల్లడించలేదు.

పారీ పాసవాన్‌ తన భర్త వేధిస్తున్నాడంటూ గతంలో పోలీసులను ఆశ్రయించింది. దాంతో భర్త నీరజ్‌ పాసవాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జైలుకు తరలించారు. ఈ కేసులో భర్త నీరజ్‌ బంధువులు పారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పారీ పాసవాన్ ముంబైకి చెందిన ఓ ప్రొడక్షన్ హౌస్‌లో పోర్న్ ఫిలింలో నటించిందని ఆరోపించారు. అంతేకాదు.. అమాయకులను బుట్టలో వేసుకుని మోసం చేయడమే ఆమె పనిగా ఆరోపించారు. ఆమెకు 12 ఏళ్ల పాప ఉందని, ఇదివరకే ఇద్దరితో పెళ్లి అయిందని నీరజ్ సోదరుడు చందన్ ఆరోపించారు. వారిపై కూడా కేసులు పెట్టిందని పేర్కొన్నారు. తనకు పాప ఉందనే ఆరోపణలపై పాశ్వాన్ ప్రతిస్పందిస్తూ.. తన పెళ్లికి ముందు తన భర్తకు ఆ విషయం తెలిసిందని, నీరజ్ ఆ చిన్నారితో ఆడుకుంటున్న ఫొటోలు కూడా తమ పెళ్లికి ముందు ఉన్నవేనని తెలిపింది. పారి పాశ్వాన్ 2019లో జరిగిన మిస్‌ ఇండియా యూనివర్స్‌ కంటెస్టెంట్‌ లో పాల్గొని టైటిల్‌ను సొంతం చేసుకుంది. అప్పుడే నీరజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Nizamabad : రెండు త‌ల‌ల‌తో పుట్టిన గొర్రె పిల్ల‌