Mukku Avinash : ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాష్
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిశ్చితార్థం పూర్తైనట్లుగా అవినాష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు.

Mukku Avinash
Mukku Avinash : జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిశ్చితార్థం పూర్తైనట్లుగా అవినాష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు అవినాష్. మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏ మాత్రం వెయిట్ చేయోద్దు. మా ఫ్యామిలీలు కలిసాయి. మేము కలిసాం. వెంటనే ఎంగేజ్‌మెంట్ అయింది. మీరు అందరు ఎప్పటి నుండో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు.నా అనూజతో త్వరలోనే చేసుకోబోతున్నాను.ఎప్పటిలానే మీ ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటున్నాను అని అవినాష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
జబర్దస్త్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో అవినాష్ ఒకరు. జబర్దస్త్ క్రేజ్ తో అతడికి బిగ్ బాస్ లో కూడా అవకాశం లభించింది. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి తన జోకులతో అందరిని నవ్వించాడు. హౌస్ లో ఉన్న సమయంలో అరియనతో క్లోజ్ గా మూవ్ అవడంతో వీరి మధ్య ఎదో నడుస్తుందనే రూమర్స్ వచ్చాయి. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా అరియనా – అవినాష్ చెట్టాపట్టాలేసుక తిరిగారు. వీరు పెళ్లిపీటలు ఎక్కడ ఖాయమని చాలామంది జ్యోష్యం చెప్పారు. అయితే ఈ జోష్యాలకు, రూమర్స్ కి పులిస్టాప్ పెట్టారు అవినాష్.