TRS : సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్, మూడు రోజులు అక్కడే

సీఎం కేసీఆర్‌ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం మధ్యాహ్నం సీఎం బయలుదేరతారు.

TRS : సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్, మూడు రోజులు అక్కడే

Kcr Delhi Tour

TRS Delhi Office : సీఎం కేసీఆర్‌ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం మధ్యాహ్నం సీఎం బయలుదేరతారు. గురువారం ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి కేసీఆర్‌ భూమి పూజ చేస్తారు. సెప్టెంబర్‌ 3న హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. మూడు రోజుల కేసీఆర్‌ టూర్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని వసంత్‌ విహారం మెట్రో స్టేషన్‌ పక్కన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం.. కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.

Read More : Andhra Pradesh : 40 మంది డీఎస్పీలకు పదోన్నతి

వసంత్ విహార్ : –
వసంత్‌ విహార్‌లో టీఆర్‌ఎస్‌ కార్యాలయ భూమి పూజకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మట్టి చదును పనులు పూర్తయ్యాయి. భూమి పూజకు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఐదు అంతస్తుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణం కానుంది. JDU, సమాజ్‌వాది పార్టీ కార్యాలయాల పక్కన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఎంబసీ కార్యాలయాలు, వసంత్‌ విహార్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో కార్యాలయం నిర్మిస్తున్నారు.

Read More :KRMB : పానీ పే చర్చ, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు మీటింగ్

రూ. 8 కోట్లు : –
తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటుతో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర షోపించనుంది టీఆర్ఎస్‌.  2020 అక్టోబర్‌ 9న 11 వందల చదరపు మీటర్ల భూమిని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి కేంద్రం కేటాయించింది. పార్టీ ఆఫీస్‌ భూమి కోసం టీఆర్‌ఎస్‌ 8 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించింది.  సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత హస్తినబాట పట్టనున్నారు.

Read More :AP Corona : ఏపీలో 24 గంటల్లో 1,115 కరోనా కేసులు

మోదీ, కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ : –
ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉందంటున్నాయి టీఆర్‌ఎస్‌ వర్గాలు. కృష్ణా జలాల వివాదం, కేంద్ర గెజిట్‌ సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీని కేంద్రం పరిధి నుంచి తప్పించి ప్రత్యేక అధికారులు ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తుంది. రాయలసీమ పథకాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కేంద్రం సహకారం అందించాలని కోరనున్నారు సీఎం కేసీఆర్. అటు దళితబంధు పథకానికి ప్రత్యేక నిధులు కోరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.