AP Corona : ఏపీలో 24 గంటల్లో 1,115 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,115 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 52,319 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

AP Corona : ఏపీలో 24 గంటల్లో 1,115 కరోనా కేసులు

Ap Corona

AP corona new cases : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,115 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 52,319 కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.

కరోనా వైరస్ సోకి మరో 19 మంది మరణించారు. తాజాగా కరోనా నుంచి 1,265 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,14,116కు చేరింది. ఇప్పటివరకు 19,85,566 మంది బాధితులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇప్పటివరకు వైరస్‌ బారినపడి మొత్తం 13,857 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 210, కృష్ణా జిల్లాలో 165, పశ్చిమ గోదావరి జిల్లాలో 125 పాజిటివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 121, ప్రకాశం జిల్లాల్లో 121 కేసులు నమోదయ్యాయి.