Twisha Sharma Death: నటి త్విషా శర్మ అనుమానాస్పద మృతి.. పెళ్లయిన ఐదు నెలలకే విషాదం.. పరారీలో భర్త
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నటి త్విషా శర్మ(Twisha Sharma).
- V Santhosh Kumar
- Updated on- May 19, 2026 / 06:18 PM IST
former miss pune twisha sharma death case sit investigation going on
- నటి త్విషా శర్మ అనుమానాస్పద మృతి
- అత్తవారింట్లో వరకట్న వేధింపుల ఆరోపణలు
- పరారీలో ఉన్న భర్త కోసం వేట
Twisha Sharma: మాజీ మిస్ పుణే, సినీ నటి త్విషా శర్మ మరణం చిత్ర పరిశ్రమతో పాటు పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఏడాది మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన అత్తవారి ఇంట్లో ఆమె శవమై కనిపించింది. కేవలం ఐదు నెలల క్రితమే, అంటే 2025 డిసెంబర్‌లో సమర్థ్ సింగ్‌తో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, ఆమె తల్లిదండ్రులు భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్‌లపై వరకట్న వేధింపులు, తీవ్రమైన మానసిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Manasa Varanasi: చీరకట్టులో మాజీ మిస్ ఇండియా.. మానస వారణాసి అందానికి నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నిందితుడైన భర్త సమర్థ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో, అతని అరెస్టుకు దారితీసే సమాచారం ఇచ్చిన వారికి రూ.10,000 బహుమతిని కూడా ప్రకటించారు. మరోవైపు, రిటైర్డ్ జడ్జి అయిన అత్త గిరిబాల సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించింది. అయితే, వివాహమైన ఏడేళ్లలోపు జరిగిన అసాధారణ మరణం కాబట్టి ఈ బెయిల్ ఇవ్వడాన్ని త్విషా కుటుంబ న్యాయవాది తప్పుబడుతున్నారు. అటు అత్తగారి కుటుంబం మాత్రం త్విషాకు మానసిక సమస్యలు ఉన్నాయని, చికిత్స తీసుకుంటోందని ఆరోపిస్తోంది.
ట్విషా శర్మ(Twisha Sharma) గతంలో గ్లామర్ ప్రపంచంలో రాణించి, ఆ తర్వాత కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టింది. మిస్ పుణేగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, 2018లో ‘జరా సంభాల్ కే’ చిత్రంతో నటన రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2021లో శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన తెలుగు కామెడీ థ్రిల్లర్ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో నటించింది. ఇదే ఆమెకు చివరి చిత్రం. సినిమా రంగం నుండి తప్పుకున్నాక ఆమె ఒక రెస్టారెంట్ సెక్టార్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఇంతలోనే ఆమె జీవితం ఇలా విషాదాంతం కావడం అందరినీ కలచివేస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
