Veede Mana Varasudu : ‘వీడే మన వారసుడు’ రైతుల మీద తీసిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..

రైతుల జీవితాలపై తెరకెక్కుతున్న సందేశాత్మక సినిమా ‘వీడే మన వారసుడు’.

Former Story Veede Mana Varasudu Movie Release Date Announced

Veede Mana Varasudu : రైతుల జీవితాలపై తెరకెక్కుతున్న సందేశాత్మక సినిమా ‘వీడే మన వారసుడు’. అర్.ఎస్ ఆర్ట్స్ బ్యానర్ పై రమేష్ ఉప్పు మెయిన్ లీడ్ లో నటిస్తూ ఈ సినిమాని దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్నాడు. లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్, సమ్మెట‌ గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 18న తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.

Also Read : Junior : శ్రీలీల – జెనీలియా సినిమా మొత్తానికి వస్తుందయ్యో.. టీజర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత రమేష్ ఉప్పు మాట్లాడుతూ.. స‌మాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. రైతుల పోరాటం, మాదక ద్రవ్యాల ప్రభావం వంటి అమాశాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డు స‌భ్యుల‌తో పాటు, ప్రీమియ‌ర్ షో చూసిన ప‌లువురు ప్ర‌ముఖులు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో మా న‌మ్మ‌కం మ‌రింతా పెరిగింది. మా శ్ర‌మ‌కు మంచి సక్సెస్ అందుతుందనే నమ్మకం బ‌లంగా ఉంది. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించాం అని తెలిపారు. అలాగే ఈ నెల 29న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిచబోతున్నట్టు ప్రకటించారు.