Funky Movie team released casting call poster
Funky Movie : టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా ఫంకీ. ఇక ఈ సినిమా కేవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
అయితే తాజాగా ఈ సినిమా టీమ్ సినిమాల్లో నటించాలి అనుకుంటున్న వారికి అదిరిపోయే ఛాన్స్ ఇచ్చారు. బిగ్ స్క్రీన్ పై కనిపించాలి అనుకునే వారికి అదిరిపోయే అవకాశాన్ని ఇచ్చారు. అనుదీప్ దర్శకత్వంలో, విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సరికొత్త టాలెంట్. సరికొత్త నటీ, నటులు కావాలని ఒక ప్రకనట విడుదల చేశారు.
Also Read : RRR Behind and Beyond Trailer : ‘RRR బిహైండ్ అండ్ బియాండ్’.. డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది..
ఇక అందులో..” క్యాస్టింగ్ కాల్.. మీ జెండర్ తో సంబంధం లేదు. మీ వయస్సుతో కూడా సంబంధం లేదు. మాకు కేవలం మీ లోని ప్యాషన్ మాత్రమే కావలి. మీలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్, అలాగే మీలో ఉన్న ధర్యమే మీరు చేసే క్యారెక్టర్ కి కావాలి అని అందులో పేర్కొన్నారు. దీంతో ఫంకీ మూవీ టీమ్ చేసిన ఈ ప్రకటన నెట్టింట వైరల్ అవుతుంది. మీలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ను బయట పెట్టడానికి ఇది మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ నంబర్ కి మీ ప్రొఫైల్ పంపండి.