RRR Behind and Beyond Trailer : ‘RRR బిహైండ్ అండ్ బియాండ్’.. డాక్యుమెంట‌రీ ట్రైలర్ వచ్చేసింది..

ఆస్కార్ అవార్డును గెలుచుకొని చ‌రిత్ర‌ సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.

RRR Behind and Beyond Trailer : ‘RRR బిహైండ్ అండ్ బియాండ్’.. డాక్యుమెంట‌రీ ట్రైలర్ వచ్చేసింది..

RRR movie Behind and Beyond Documentary Trailer released

Updated On : December 17, 2024 / 5:20 PM IST

RRR Behind and Beyond Trailer : ఆస్కార్ అవార్డును గెలుచుకొని చ‌రిత్ర‌ సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాతో తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయిలో గర్వించేలా చేసాడు రాజమౌళి. ఏకంగా హాలీవుడ్ ప్రముఖుల వరకు తెలుగు సినిమాలను తీసుకువెళ్లాడు. ఇక ఇంతటి చరిత్ర సృష్టించిన ఈ సినిమా డాక్యుమెంట‌రీ తీస్తున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్‌ బియాండ్ అనే టైటిల్‌తో ఈ డాక్యుమెంట‌రీ రాబోతుంది.

Also Read : Sreeleela : కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన శ్రీలీల.. ఒకేసారి అన్ని సినిమాలా..

ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్‌ బియాండ్ డాక్యుమెంట‌రీని డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంట‌రీ స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి సంబందించిన ప్రకటన కూడా చేశారు. ఇక ఇందులో RRR సినిమా రిలీజ్ కి ముందు మేకింగ్, ప్రీ ప్రొడక్షన్, రిలీజ్ తర్వాత సినిమా సాధించిన విజయాలు ఇలా ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అన్నీ క్లియర్ గా ఉంటాయి. అయితే నేడు దీని ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.. ట్రైలర్  ఎలా ఉందో మీరు కూడా చూసెయ్యండి..

ఇక ట్రైలర్ లో.. రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాకోసం ఇద్దరు పులులతో కలిసి పనిచేశానని చెప్పాడు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం ఈ సినిమా కోసం ఎంత కష్ట పడ్డారో.. ఎలా చేసారో తెలిపారు. ఇందులో హీరోయిన్ గా నటించిన ఆలియా కూడా ఈ సినిమా గురించి తెలిపింది. ట్రైలర్ లో మూవీ టీమ్ అంతా ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో తెలుస్తుంది.