Gaddar last film Ukku Satyagraham Movie release date
Ukku Satyagraham : విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదంతో తెరకెక్కిన సినిమా ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమాలో సత్యారెడ్డి హీరోగా నటిస్తూనే దర్శక, నిర్మాత బాధ్యతలు వహించారు. ఈ సినిమాలో విప్లవ కవి గద్దర్ నటించారు. గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే కావడం విశేషం. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఉక్కు సత్యాగ్రహం సినిమా ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో గద్దర్ మూడు పాటలు పాడి రెండు పాటల్లో, కొన్ని సీన్స్ లో నటించారు. సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ప్రెస్ మీట్ లో దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ.. విప్లవ కవి గద్దర్ అన్న నటించిన ఆఖరి సినిమా ఉక్కు సత్యాగ్రహం ఈ నెల 29న విడుదల కానుంది. తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసిన లక్ష్మి నారాయణ గారితో పాటు ఎంతో మంది ఉద్యమకారులని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా కథానాయకుడి పాత్ర గద్దర్ గారు తీర్చిదిద్దారు. ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఉద్యమ సినిమా అని తెలిపారు.
Ram Gopal Varma: నేనేమీ భయపడటం లేదు.. వీడియో విడుదల చేసిన ఆర్జీవీ.. సంచలన వ్యాఖ్యలు
ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన ఎక్స్ సీబీఐ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. ఉక్కు సత్యాగ్రహం సినిమా ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రయివేటీకరణ చేస్తున్నారు, అక్కడి ప్రజలు ఎలా అడ్డుకుంటున్నారు అనేది చూపించారు. కొన్ని సన్నివేశాలు చూసాను, ఈ సినిమా ఇన్స్పిరింగ్ గా ఉంటుంది. గద్దర్ గారు కూడా ఈ సినిమాలో నటించడం మంచి విషయం. ఆయన నన్ను లచ్చన్న ఎట్లున్నావ్ అని పలకరించేవారు.
ఆయన స్ఫూర్తి ని ఈ సినిమాలో నింపారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ కాకుండా ఉంటుందని కోరుకుంటున్నాను అని తెలిపారు. గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ.. గద్దర్ గారు హైదరాబాద్ నుంచి విశాఖకు బయల్దేరి మళ్ళీ ఇంటికొచ్చే వాళ్ళు. ఈ సినిమా కోసం ఆయన చాలా సమయం కేటాయించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశ్యం. ఎవరైతే తమ రక్తం చిందించి స్టీల్ ప్లాంట్ ని డెవలప్ చేసారో, వాళ్ళ కోసం ఈ సినిమా చేసారు గద్దర్ గారు అని తెలిపింది.