Bigg Boss : బిగ్‌బాస్ లోకి వెళ్తా.. ఛాన్స్ ఇవ్వండి అంటున్న పోలీస్.. వీడియో వైరల్..
నంద్యాల జిల్లా గడివేముల ఎస్సై నాగార్జున రెడ్డి బిగ్ బాస్ అవకాశం ఇవ్వాలంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు. (Bigg Boss)
- Saketh U
- Published on- June 25, 2026 / 05:29 PM IST
Bigg Boss
Bigg Boss : త్వరలోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. గత కొన్ని సీజన్స్ నుంచి సామాన్యులకు కూడా బిగ్ బాస్ లో అవకాశం కల్పిస్తామంటూ అగ్నిపరీక్ష నిర్వహించి బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆ షోపై ఆసక్తి ఉన్నవారంతా బిగ్ బాస్ ఛాన్స్ ఇప్పించమంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ పోలీస్ బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వండి అంటూ వీడియో చేయడం చర్చగా మారింది.
నంద్యాల జిల్లా గడివేముల ఎస్సై నాగార్జున రెడ్డి బిగ్ బాస్ అవకాశం ఇవ్వాలంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
Also Read : Singer Sunitha : పాపం.. ఇప్పటికి ఆ వ్యాధితో బాధపడుతున్న సింగర్ సునీత..
ఈ వీడియోలో ఎస్సై నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అనేది కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాకూడదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన సాధారణ వ్యక్తులకు కూడా అవకాశం కల్పించాలి. నాలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాను. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టడం ఎంత కష్టమో, అక్కడ చివరి వరకు కొనసాగడం కూడా అంతే సవాల్‌తో కూడుకున్న విషయం. అయినా ఓర్పు, సహనం, మానసిక ధైర్యంతో అన్ని టాస్క్‌లను ఎదుర్కొని సత్తా చాటుతాను. ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు అధికారిగా నాకు ప్రజల మనస్తత్వం తెలుసు. అదే అనుభవంతో బిగ్‌బాస్ వేదికపై కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతుతో విజేతగా నిలవగలననే నమ్మకం ఉంది అని అన్నారు.
దీంతో ఓ పోలీస్ ఆఫీసర్ ఇలా బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వండి అంటూ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఇతనికి బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తారా అని చర్చ కూడా మొదలైంది. అయితే దీనిపై పలువురు నెటిజన్లు మంచి జాబ్ ఉంది చేసుకోకుండా ఆ బిగ్ బాస్ ఎందుకు అని తిడుతుంటే మరికొంతమంది బిగ్ బాస్ కి వెళ్ళండి సపోర్ట్ చేస్తా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read : Mirzapur The Movie Teaser : ‘మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ వచ్చేసింది..
బిగ్ బాస్ సీజన్ 10లో నాకు అవకాశం కల్పించండి..
నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో
తన కూతుర్ల కోరిక మేరకు ఈ వీడియో చేశానని, షోలో సత్తా చాటుతానని పేర్కొన్న ఎస్ఐ pic.twitter.com/aVbZLTl6EQ
— Vijaya Reddy (@VijayaReddy_R) June 25, 2026
