Singer Sunitha : పాపం.. ఇప్పటికి ఆ వ్యాధితో బాధపడుతున్న సింగర్ సునీత..
ఈ క్రమంలో తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది సునీత. (Singer Sunitha)
Singer Sunitha
Singer Sunitha : తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రొఫెషనల్ గా తన పాటలతో అందర్నీ మెప్పించి స్టార్ సింగర్ గా ఎదిగింది సునీత. తన పిల్లలు పెద్దయ్యాక వారి ఇష్టంతోనే రెండో పెళ్లి కూడా చేసుకొని ప్రస్తుతం హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ప్రస్తుతం సినిమాల్లో పాడుతూనే ప్రైవేట్ ఈవెంట్స్, కాన్సర్ట్స్ నిర్వహిస్తూ, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉంది సునీత. తాజాగా చాన్నాళ్లకు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది సునీత.
ఈ ఇంటర్వ్యూలో సునీత పలు అంశాల గురించి మాట్లాడింది. ఈ క్రమంలో తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది.
Also Read : Naga Durga : సినిమా చేయాలంటే.. నిర్మాతకు 15 కండిషన్స్ పెట్టిన తెలుగు హీరోయిన్..
సునీత మాట్లాడుతూ.. నేను చాలా ఏళ్లుగా క్రాన్స్(chronic inflammatory bowel disease) అనే వ్యాధితో బాధపడుతున్నాను. నా జీవితంలో జరిగిన పర్సనల్ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల వల్ల నేను చాలా ఏళ్ళు డిప్రెషన్ లో ఉన్నాను. ఆ బాధ అంతా నాలో దాచిపెట్టుకొని అలాగే ఉండటం వల్ల నాకు ఈ క్రాన్స్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది. ఇది ఒక ప్రేగులకు సంబంధించిన వ్యాధి. ఇప్పటికీ నేను దాంతో ఫైట్ చేస్తున్నాను. నాకు కొంచెం ఒత్తిడి పెరిగినా శరీరం అంతా విపరీతమైన నొప్పులు వస్తాయి అని తెలిపారు.
అసలు ఈ క్రాన్స్ వ్యాధి ఏంటి..
ఈ క్రాన్స్ వ్యాధి నోటి నుండి పాయువు వరకు జీర్ణవ్యవస్థ పొడవునా ఎక్కడైనా వాపు, చికాకును కలిగించే దీర్ఘకాలిక శోథ ప్రేగు వ్యాధి. దీనికి పూర్తి నివారణ లేకపోయినా వైద్య చికిత్సలు, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఈ వ్యాధి ద్వారా వచ్చే లక్షణాలు అదుపులో ఉంటాయని సమాచారం. ఈ వ్యాధి వల్ల.. జీర్ణ సంబంధిత సమస్యలు, విరేచనాలు, కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట, జ్వరం, ఆకలి తగ్గడం, పుండ్లు, ప్రేగు సంకోచాలు, ప్రేగులకు సంబంధించిన సమస్యలు వస్తాయని తెలుస్తుంది.
Also Read : Mirzapur The Movie Teaser : ‘మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ వచ్చేసింది..
