Gali Janardan Reddy
Kiriti Reddy : కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒకప్పుడు వార్తల్లో ట్రెండింగ్ లో నిలిచాడు. కర్ణాటక రాజకీయాల్లో తన చక్రం తిప్పాడు. తెలుగు వాళ్ళకి కూడా గాలి జనార్దన్ రెడ్డి సుపరిచితమే. తాజాగా మరోసారి గాలి జనార్దన్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం ఆయన తనయుడు కిరీటి రెడ్డి. గాలి జనార్దన్ తనయుడు కిరీటి రెడ్డి త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు.
ఇప్పటికే కిరీటి రెడ్డి నటన, డ్యాన్స్, ఫైటింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడట. కన్నడలో ‘మాయాబజార్’ అనే సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ కిరీటిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరక్కించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ గురించి డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ”నటుడు కావాలన్నది కిరీటి కల. ఇప్పటికే అతడు యాక్టింగ్, డ్యాన్స్, ఫైటింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ స్ఫూర్తితోనే కిరీటి సినిమాల్లోకి వస్తున్నాడు.” అని తెలిపాడు.
Nithin : హీరో నితిన్ వైఫ్‌కి కరోనా.. దూరం దూరంగా బర్త్‌డే సెలబ్రేషన్స్
ఈ సినిమాని తెలుగులో అందాల రాక్షసి, లెజెండ్ లాంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. కిరీటిని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి గాలి జనార్దన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.