Gam Gam Ganesha : ఆనంద్ దేవ‌ర‌కొండ ‘గం..గం..గణేశా’ విడుద‌ల తేదీ ఫిక్స్‌.. థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఆరోజే..

విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టినా త‌న‌కంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌.

Gam Gam Ganesha Release date : విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టినా త‌న‌కంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. బేబీ సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్న ఆనంద్ ప్ర‌స్తుతం గం గం గ‌ణేశా సినిమాలో న‌టిస్తున్నాడు. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిర్ కాగా.. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్‌ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు.

కాగా.. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, పాట‌లు మూవీపై అంచ‌నాల‌ను పెంచేసింది. తాజాగా చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ సినిమాను మే 31న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. కొండ అంచున నిలబడి ఉన్న హీరో ఆనంద్ గన్ ఫైర్ చేసినప్పుడు ఆ గన్ నుంచి గులాబి రేకలు వస్తున్నట్లు చేసిన డిజైన్ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Guttu Chappudu : బ్రహ్మాజీ తనయుడి నెక్స్ట్ సినిమా టీజర్ రిలీజ్.. ‘గుట్టు చప్పుడు’ కాకుండా..

ఇదిలా ఉంటే. ఆదివారం రోజున ఆనంద్ దేవ‌ర‌కొండ ఈ సినిమా విడుద‌ల తేదీ గురించి ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. క్రైమ్, కామెడీ డ్రామా కోసం మేము కొన్నాళ్లుగా ప‌ని చేశాము. చిత్రీక‌ర‌ణ‌లో కొన్ని అడ్డంకులు ఎదురు అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ వాళ్లు చెప్పిన‌ట్లుగా అంతా స‌వ్యంగా ముగుస్తుంది. ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా. కామెడ్రీ, డ్రామా, వినూత్న రీతిలో హ్యాండిల్ చేశామ‌ని ఆ ట్వీట్లో తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు