Game Changer Piracy : డబ్బులివ్వకపోతే లీక్ చేస్తామని బెదిరించారు.. ‘గేమ్ ఛేంజర్’ పైరసీ చేసిన వాళ్లపై.. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు..

గేమ్ ఛేంజర్ సినిమాని కొంతమంది రెండో రోజే HD ప్రింట్ లీక్ చేశారు.

Game Changer Movie Unit Complaints on Movie Piracy and Threats in Cyber Crime

Game Changer Piracy : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఇటీవల జనవరి 10న థియేటర్స్ లో రిలీజయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. మొదటి రోజు 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి పండగ కావడంతో ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీలు కూడా థియేటర్ కి వెళ్లి సినిమాని చూసే ప్లాన్ లో ఉన్నారు.

కానీ గేమ్ ఛేంజర్ సినిమాని కొంతమంది రెండో రోజే HD ప్రింట్ లీక్ చేశారు. సోషల్ మీడియాలో, టెలిగ్రామ్ లో సినిమాని షేర్ చేశారు. ఆన్లైన్ లో పైరసీ ప్రింట్ ని రిలీజ్ చేశారు. కొన్ని ప్రైవేట్ బస్సుల్లో కూడా గేమ్ ఛేంజర్ సినిమాని టెలికాస్ట్ చేశారు. దీంతో మూవీ టీమ్ పైరసీ విషయంలో సీరియస్ అయింది. తాజాగా మూవీ యూనిట్ దీనిపై సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసింది.

Also See : Actress Anjali : ‘గేమ్ ఛేంజర్’ వర్కింగ్ స్టిల్స్.. పార్వతమ్మ పాత్రలో అంజలి ఫోటోలు చూశారా?

తమ ఫిర్యాదులో.. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందు నిర్మాతలతో పాటు సినిమాకు సంబంధించిన కీలక వ్యక్తులకు సోషల్ మీడియా, వాట్సాప్‌లలో బెదింపులు వచ్చాయి. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని కొంతమంది గొడవకు దిగారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేశారు. సినిమా రిలీజయిన తర్వాత HD ప్రింట్ లీక్ చేయడమే కాకుండా టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు అని తెలిపింది.

గేమ్ చేంజర్ మూవీ యూనిట్ ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది మూవీ యూనిట్. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి గేమ్ ఛేంజర్ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాలి. ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

Also Read : Unstoppable with NBK : బాలయ్య – రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో వచ్చేసింది..

అలాగే కొన్ని సోషల్ మీడియా పేజీలు సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. దాంతో ఆ పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు మూవీ యూనిట్.

గేమ్ ఛేంజర్ సినిమాకు ముందు నుంచి కొంతమంది నెగిటివిటి స్ప్రెడ్ చేస్తున్నారు. కొంతమంది హీరోల అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్ళు సోషల్ మీడియాలో డైరెక్ట్ గా సినిమాని లీక్ చేస్తాం అంటూ రిలీజ్ కి ముందే పోస్టులు పెట్టి హడావిడి చేశారు. రిలీజయ్యాక కూడా సినిమా డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేశారు. కావాలని కొంతమంది సినిమాపై, రామ్ చరణ్ పై నెగిటివిటి చేశారు. దీనివల్ల సినిమాకు ఎఫెక్ట్ అయింది. దీంతో మూవీ యూనిట్ ఇలా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకనైనా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్, ఇలాంటి నెగిటివిటి స్ప్రెడ్ చేయడం ఆపేస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.