Game Changer : రామ్ చరణ్ బర్త్ డేకి గిఫ్ట్ ఫిక్స్.. ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ అదే.. అయినా నిరాశలోనే అభిమానులు..
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.
- Saketh U
- Published On : March 5, 2024 / 05:43 PM IST
Game Changer Movie Update on Ram Charan Birthday
Game Changer : రామ్ చరణ్(Ram Charan) నెక్స్ట్ సినిమా గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో శంకర దర్శకత్వంలో మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమా నుంచి ఒక్క టైటిల్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో చరణ్ అభిమానులు శంకర్ పై, దిల్ రాజు పై కోపంగా ఉన్నారు. ఇప్పటికి ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా గేమ్ ఛేంజర్ యూనిట్ కే క్లారిటీ లేదు.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది. గతంలో గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి జరగండి..’ అనే ఓ పాట లీక్ అయింది. దీంతో ఆ పాటని గత సంవత్సరం దీపావళికి అఫీషియల్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అది కూడా రిలీజ్ చేయలేదు. దీంతో చరణ్ అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. ఈ నెలలో మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు ఉంది. ఆ రోజు గేమ్ ఛేంజర్ నుంచి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : Aa Okkati Adakku : ఫరియాని ‘ఓ మేడం..’ అంటూ అల్లరి నరేష్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్..
తాజా సమాచారం ప్రకారం అప్పుడు లీక్ అయిన ‘జరగండి జరగండి..’ సాంగ్ నే ఇప్పుడు అధికారికంగా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఏదైనా గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ చేస్తారు అనుకుంటే ఆ లీక్ అయిన పాటనే రిలీజ్ చేస్తున్నారని మళ్ళీ అభిమానులు నిరాశ పడుతూనే పోనిలే.. కనీసం ఇది అయినా రిలీజ్ చేస్తున్నారు అని సంతృప్తి పడుతున్నారు. మరి చరణ్ బర్త్ డేకి ఆ పాట అయినా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
