Game Changer : ‘గేమ్ ఛేంజ‌ర్’ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చిన త‌మ‌న్‌.. ఈ సారి మెలోడీతో

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

Game Changer third single update by Thaman

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది. ఈ సినిమా డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ క్ర‌మంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. వ‌రుస‌గా పాట‌ల‌ను విడుద‌ల చేస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన మొద‌టి సాంగ్ ‘జ‌ర‌గండి జ‌ర‌గండి’, రెండో సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ పాట‌ల‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది.

NTR : దేవ‌ర స‌క్సెస్ పార్టీ.. కొర‌టాల శివ మా ఫ్యామిలీలో ఒక‌రు : ఎన్టీఆర్‌

ఈ క్ర‌మంలోనే మూడో పాటను విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమ‌వుతోంది. ఈ రెండు పాట‌లు మాస్ పాట‌లు కాగా.. ఈ సారి మెలోడి పాట‌ను రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ విష‌యాన్ని సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ తెలియ‌జేశారు. అక్టోబ‌ర్ లో మెలోడిని విడుద‌ల చేస్తామ‌ని, ప్రేక్ష‌కుల‌ను ఈ పాట క‌ట్టిప‌డేస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు. నవంబర్ నుంచి గేమ్ ఛేంజర్ గ్లోబల్ రేంజ్ వైబ్ స్టార్ట్ అవుతుందన్నారు.

Bigg Boss 8 : విష్ణు ప్రియ ల‌వ్ సంగ‌తి చెప్పేసింది.. జ్యోతిష్యుడిగా మారిన మణికంఠ.. బిగ్‌బాస్ పంజ‌రంలో రెండు ప్రేమ చిలుక‌లు..