NTR : దేవ‌ర స‌క్సెస్ పార్టీ.. కొర‌టాల శివ మా ఫ్యామిలీలో ఒక‌రు : ఎన్టీఆర్‌

ఎన్టీఆర్ హీరో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ దేవ‌ర‌.

NTR : దేవ‌ర స‌క్సెస్ పార్టీ..  కొర‌టాల శివ మా ఫ్యామిలీలో ఒక‌రు : ఎన్టీఆర్‌

Devara Success Party NTR heart touching words about Koratala Siva

Updated On : October 4, 2024 / 12:50 PM IST

NTR : ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ దేవ‌ర‌. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో దేవ‌ర స‌క్సెస్ మీట్ ని అభిమానుల స‌మ‌క్షంలో పెద్ద ఎత్తున చేయాల‌ని భావించింది చిత్ర బృందం. అయితే.. అనుమ‌తి ల‌భించ‌కపోవ‌డంతో ఓ హోటల్‌లో ఈ వెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి చిత్ర బృందం, ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి, ప్ర‌శాంత్ నీల్‌తో పాటు ప‌లువురు హాజ‌రు అయ్యారు.

ఈ క్ర‌మంలో కొర‌టాల శివ పై ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బృందావనం మూవీతో త‌మ ప్ర‌యాణం మొద‌లైంద‌న్నారు. ఇప్పుడాయన త‌న కుటుంబ సభ్యుడిగా మారారని చెప్పుకొచ్చారు. ‘దేవర 2’ చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఇక నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ గురించి మాట్లాడుతూ త‌న‌కు, కల్యాణ్‌ రామ్‌ అన్నయ్యకు హరికృష్ణ కొసరాజు వెన్నెముకలాంటి వారన్నారు. ఆయన వల్లే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ఉంది’ అని అన్నారు.

ఇదిలా ఉంటే.. స‌క్సెస్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి.