Game Changer vs NBK 109 in Sankranti 2025 race
సంక్రాంతి వచ్చేస్తుంది. కోళ్ల పందెలు..పిండివంటలే కాదు. తెలుగు ప్రజలకు సినిమాలు కూడా పండగను తెస్తాయ్. ప్రతీ ఏడాది సంక్రాంతి రేసులో కనీసం రెండు మూడు సినిమాలు ఉంటాయి. ఈ సారి కూడా రెండు మూవీస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోబోతున్నాయ్. ఈసారి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ కనిపిస్తోంది. ఇండస్ట్రీకి చెందిన రెండు ప్రముఖ కుటుంబాల నుంచి సినిమాలు వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుష్ అయిపోతున్నారు. అందుకు తగ్గట్లుగానే..సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు.
ఇప్పటికే స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ.. సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 109 మూవీ కూడా సంక్రాంతి రేసులో ఉంది. దీంతో ఈ రెండు ఫ్యామిలీ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అటు మెగా ఫ్యామిలీకి, ఇటు నందమూరి ఫ్యామిలీకి ఓ రేంజ్‌లో ఫ్యాన్స్ ఉంటారు. వ్యక్తిగతంగా రామ్‌చరణ్‌కు, బాలకృష్ణకు కూడా ఫాలోయింగ్ బానే ఉంది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
Bigg Boss 8 : ప్రేరణపై పృథ్వీ పగ.. గరంగరంగా నామినేషన్స్
బాలయ్య వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. రామ్‌చరణ్ RRR తర్వాత సోలో హీరోగా ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడు. దీంతో రెండు సినిమాలపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే ఇప్పటినుంచే మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మా హీరో చింపిపడేస్తారని రామ్‌చరణ్ ఫ్యాన్స్, బాలయ్య సినిమా అంటేనే పవర్ ఫుల్ మాస్ మసాలా అని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరీ సంక్రాంతి బరిలో పైచేయి సాధించే సినిమా ఏదో.