Gangster Gangaraju: గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్రైలర్.. సూపర్ అంటోన్న ఆడియెన్స్!

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిద్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో లక్ష్. 'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న.....

Gangster Gangaraju: గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్రైలర్.. సూపర్ అంటోన్న ఆడియెన్స్!

Gangster Gangaraju Trailer Impressive

Updated On : June 13, 2022 / 5:20 PM IST

Gangster Gangaraju: రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిద్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో లక్ష్. ‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.

Gangster Gangaraju : తెలుగు, తమిళ్ లో గ్యాంగ్‌స్టర్ గంగరాజు వచ్చేస్తున్నాడు..

కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందనే చెప్పుకోవాలి. “వాడిప్పుడొక రక్తం మరిగిన పులిలాంటోడు.. గ్యాంగ్‌స్టర్ కా గాడ్‌ఫాదర్” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాలో లక్ష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఈ ట్రైలర్ చూపించారు. ఈ వీడియోలో సినిమాలోని యాక్షన్, రొమాంటిక్, ఫన్నీ ఎలిమెంట్స్ అన్నీ చూపించడంతో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అవుతుందని అర్థమవుతోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం.

ఇకపోతే ఇప్పటికే విడుదల చేసిన ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లిరికల్ సాంగ్స్ ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించాయి. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా ఘనంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.